Friday, January 3, 2014


VRO Syllabus

Thursday, January 2, 2014

క్లరికల్ కొలువుకు సక్సెస్ మార్గాలు..

బ్యాంకులు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన బ్యాంకుల సేవలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. డిపాజిట్ల సేకరణ, రుణాలు ఇవ్వడం వంటివే కాకుండా బీమా వంటి కార్యకలాపాలనూ సాగిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రాంచ్‌ల సంఖ్యను పెంచుకుంటూ కుర్రకారుకు కలల కొలువులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలా యువత భవితకు సుస్థిర బాటలు వేస్తున్న బ్యాంకింగ్ రంగంలో తొలి మెట్టు అయిన క్లరికల్ ఉద్యోగాలను చేజిక్కించుకోవాలంటే ఐబీపీఎస్ ఎగ్జామ్‌లో మెరుగైన మార్కులు సాధించాలి. ఈ నేపథ్యంలో మంచి స్కోర్ కోసం ప్రిపరేషన్ ప్లాన్..

 19 బ్యాంకుల్లో ఉన్న క్లరికల్ ఖాళీల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా భారీ సంఖ్యలోనే పోస్టులు ఉంటాయని అంచనా. వేలాది మంది బ్యాంకు ఉద్యోగుల పదవీ విరమణ, పెరుగుతున్న బ్రాంచ్‌ల సంఖ్య వల్ల ఖాళీల సంఖ్య అధికమవుతోంది. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి.

 రాత పరీక్ష విధానం

 రాత పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో రెండు గంటల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.

 విభాగం     మార్కులు
 రీజనింగ్     40
  ఇంగ్లిష్ లాంగ్వేజ్     40
   న్యూమరికల్ ఎబిలిటీ     40
   జనరల్ అవేర్‌నెస్
    (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం)    40
   కంప్యూటర్ నాలెడ్జ్     40
   మొత్తం    200

 ప్రిపరేషన్ వ్యూహం

 పట్టుదలతో చదివితే సాధ్యం కానిది ఏదీ లేదు. ప్రతి రోజూ ప్రణాళిక ప్రకారం చదవాలి. దీనికోసం 90 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఐబీపీఎస్ క్లరికల్ పరీక్షకు ఇంకా మూడు నెలలకు పైగా సమయం ఉంది. అందువల్ల మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థులు కూడా శ్రమించి విజయాన్ని అందుకోవచ్చు.

 రీజనింగ్

 అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్ కోడిం గ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఈ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. దీంతో సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు.

Ex: In a certain code "TERMINAL' is written as "NSFUMBOJ' and "TOWERS' is written as "XPUTSF'. How is "MATE' written in that code?
   1) FUBN    2) UFNB
   3) BNFU    4) BNDS    5) Non of these


 ఇంగ్లిష్ లాంగ్వేజ్:రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో దాదాపు 20 మార్కులు సాధించి ముందుగా కటాఫ్ నుంచి పైకి వెళ్లొచ్చు. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. మిగిలిన అంశాల్లో జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివి ఉంటాయి. వీటితో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని డెవలప్ చేసుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించడానికి ఎక్కువ సమయం కేటాయించాలి.

 Ex: Read below sentence to find out whether there is any grammatical mistake/ error if any, will be one part of sentence. Mark the number of the part with errors as your answer. If there is "No error', mark (5).
    If you have made a mistake(1)/while filling up the form(2)/you should be informed(3)/ the Income Tax department immediately(4). No error(5)


 న్యూమరికల్ ఎబిలిటీ:న్యూమరికల్ విభాగంలో ఎక్కువగా సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, రేషియోస్‌కు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆన్‌లైన్ పరీక్షలో సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కడ ఇచ్చారో తెలుసుకోవడానికి పైకి-కిందకు స్క్రోల్ చేసి చూడాలి. ఎందుకంటే ఒక్కోసారి దీనికి సంబంధించిన ప్రశ్నలు చివర్లో ఇస్తారు.

 Ex: The average weight of 21 boys was recorded as 64 kgs. If the weight of the teacher was added, the average increased by one kg. What was the teachers' weight?
1) 86 kgs    2) 64 kgs    3) 72 kgs    4) 98 kgs


 జనరల్ అవేర్‌నెస్:జనరల్ అవేర్‌నెస్ విభాగాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1. స్టాండర్డ్ జీకే. 2. కరెంట్ అఫైర్స్. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్‌లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల్లో విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రముఖ అతిథులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి.

 ఈ పేపర్‌లోనే బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానానికి సంబంధించి దాదాపు 20 వరకు ప్రశ్నలు రావొచ్చు. దీనికోసం ప్రామాణిక బ్యాంకింగ్ అవేర్‌నెస్ పుస్తకాలను ఎంచుకోవాలి. అదే విధంగా ఓ ఫైనాన్షియల్ డెయిలీని చదవాలి. అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో నిరంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు (ఉదా: వడ్డీ రేట్లు, బ్యాంకుల ఉన్నతాధికారుల పేర్లు, లోగోలు, బైలైన్స్..) తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌లో వాడే పదాలు, వాటి అర్థాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వివిధ బ్యాంకుల కొత్త విధానాలు, ఆర్‌బీఐ తాజా సమాచారం తెలుసుకోవాలి.


 Ex: 1. Which of the following is Not a function of a commercial bank?

  1)    Providing project finance
  2)    Settlement of payments of behalf of the customers
   3)    Decide policy rates like CRR, SLR, & Reporates
   4)    Issuing credit/debit/ATM cards
   5)    Providing services such as locker facilities, remittances

2.   Shanti Swarup Bhatnagar Award is given for excellence in the field of ................
1) Literature    2) Music    3) Sports
4) Science and Technology
5) Social service

 కంప్యూటర్ నాలెడ్జ్:ఈ పేపర్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంటుంది. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారించాలి. తొలి ఐబీపీఎస్ పరీక్ష నుంచి చూస్తే ఈ విభాగంలో ఇస్తున్న ప్రశ్నల కఠినత్వ స్థాయి పెరుగుతోంది. అందువల్ల అభ్యర్థులు కంప్యూటర్స్-జనరేషన్స్; ఎంఎస్ వర్డ్; ఎంఎస్ ఆఫీస్; డేటాబేస్ మేనేజ్‌మెంట్, షార్ట్‌కట్ కమాండ్స్ తదితరాల గురించి తెలుసుకోవాలి.

   Ex: The permanently etched program in ROM that automatically begins executing the computer's instructions is the
   1) BIOS     2) ROM    3) CMOS
   4) RAM     5) None of these

 రిఫరెన్‌‌స బుక్స్:    వెర్బల్ రీజనింగ్- ఆర్.ఎస్.అగర్వాల్
 ఆబ్జెక్టివ్ అర్థమెటిక్- ఎస్.ఎల్ గులాటీ
 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్- దిల్హాన్ పబ్లికేషన్స్
 ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్-హరిమోహన్ ప్రసాద్

 100 వరకు మోడల్ పేపర్లు చేశా
 నేను 100 వరకు మోడల్ పేపర్లు సాధన చేశాను. షార్ట్‌కట్స్ ఎన్ని తెలిసినా తగినన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయకుంటే ఫలితం ఉండదు. ప్రామాణిక ఇంగ్లిష్, తెలుగు పత్రికలతో పాటు ఇంటర్నెట్ సహాయంతో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌పై పట్టు సాధించా. దినపత్రికల్లో బిజినెస్ పేజీలను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంపై అవగాహన ఏర్పడింది. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, కంప్యూటర్ జనరేషన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి. ఇంగ్లిష్‌ను తేలిగ్గా తీసుకుంటే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల రోజులో కొంత సమయాన్ని ఇంగ్లిష్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఇంటర్వ్యూ ఎనిమిది నిమిషాలు జరిగింది. కుటుంబ నేపథ్యం, బ్యాంకింగ్‌కు సంబంధించిన కరెంట్ టాపిక్స్‌పై ప్రశ్నలు అడిగారు.

 - కృష్ణ చైతన్య, విజయా బ్యాంక్, హైదరాబాద్.
 (2012 ఐబీపీఎస్ క్లరికల్ విజేత)

 సక్సెస్‌కు ప్రాక్టీస్ కీలకం
 ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎంత ఫోకస్డ్‌గా చదివామన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఐబీపీఎస్ క్లరికల్, పీఓ పరీక్షల్లో విజయానికి వీలైనన్ని మోడల్ పేపర్లు సాధన చేయడం చాలా అవసరం. టైమ్ పెట్టుకొని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల తెలియని ప్రశ్నలపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుంటుంది. గ్రూప్‌గా చదవడం వల్ల సమస్యలకు తొందరగా సమాధానాలు గుర్తించేందుకు ఉపయోగపడే షార్ట్‌కట్స్ తెలుస్తాయి. కరెంట్ అఫైర్స్‌పై అప్‌డేట్‌గా ఉండాలి. దినపత్రికల్లోని ఆర్థిక సంబంధమైన ఎడిటోరియల్స్‌ను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు. బ్యాంకింగ్ టెర్మినాలజీ కూడా ఒంటపడుతుంది. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, బ్యాంకింగ్ అవేర్‌నెస్ బుక్స్‌ను ఉపయోగించుకోవాలి.
 - బొడ్డు శ్రీకాంత్, ఐవోబీ, నల్లజెర్ల.
 (2012 ఐబీపీఎస్ పీఓ విజేత)

 ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ వివరాలు

 అర్హత: ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్ వాడుకకు సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం.
 వయో పరిమితి: 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఆగస్టు 1, 2013 నాటికి). ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది.
 ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా.
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 19, 2013.
 ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: సెప్టెంబర్ 7, 2013.
 ఆన్‌లైన్ పేమెంట్: 19.8.2013-7.9.2013.
 ఆఫ్‌లైన్ ఫీ పేమెంట్: 21.8.2013-12.9.2013.
 పరీక్షల తేదీలు: 30.11.2013, 1.12.2013, 7.12.2013, 8.12.2013, 14.12,2013, 15.12.2013.
 (వీటిలో మార్పులు, చేర్పులు జరగొచ్చు.)
 రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కంచికచర్ల, కరీంనగర్, కర్నూలు, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

 ఐబీపీఎస్ ద్వారా క్లరికల్ నియామకాలు చేపడుతున్న బ్యాంకులు

 అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్.


 వెబ్‌సైట్:www.ibps.in

బాధ్యతతో కూడిన కొలువులకు... సీఎస్‌ఆర్

ఆగస్టు మొదటి వారంలో కంపెనీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.. ఈ బిల్లు ప్రకారం కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం నిధులను కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కోసం విధిగా కేటాయించాలి.. అంతేకాకుండా సంబంధిత నిపుణుడు డెరైక్టర్‌గా సీఎస్‌ఆర్ కోసం ప్రత్యేక విభాగాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.. దీన్ని అచరణ సాధ్యం చేయాలంటే ప్రత్యేక నైపుణ్యం ఉన్న మానవ వనరులు అవసరం.. ఈ నేపథ్యంలో కెరీర్ డెస్టినేషన్స్‌లో సీఎస్‌ఆర్‌కు చోటు దక్కింది. విలక్షణ కెరీర్‌గా మారనున్న.. సీఎస్‌ఆర్ అంటే ఏమిటి? ఈ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి అవసరమైన అర్హతలు తదితర అంశాలపై ఫోకస్..

 ఆర్థిక సంస్కరణల తర్వాత.. దేశాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల పాత్ర పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమకున్న వనరుల ద్వారా సమాజాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు తమ వంతు చేయూతనందించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

 అంకురార్పణ:
 కంపెనీ తన సమయూన్ని, వనరులను సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వినియోగించాలి. ఎందుకంటే సమాజం లేనిదే ఈ సంస్థలకు మనుగడ లేదు. అవి వ్యాపారం చేసి, లాభాలు గడించాలంటే.. సమాజం అనుకూల వాతావరణాన్ని కలిగి ఉండాలి. వాటాదారుని పెట్టుబడి వృద్ధి చెందాలంటే సమాజం తోడ్పాటు ఎంతో అవసరం. వాటాదారులతో పాటు సమాజంలోని మిగతా వర్గాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఖాతాదారులు, ఉద్యోగులు సంతృప్తి చెంద కుంటే.. సదరు వ్యాపార సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

 ఈ నేపథ్యాల్లోంచే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) అనే భావన వెలుగులోకి వచ్చింది. కేవలం వరద ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేయడమే కాదు.. నాణ్యమైన ఉత్పత్తులను చౌక ధర లకు అందించడం, పర్యావరణ అనుకూల నిబంధనలను పాటించడం, తమ సంస్థల్లో కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయడం, ఉద్యోగులకు పని నిబంధనలను మెరుగుపరచడం వంటివి కూడా సామాజిక బాధ్యత కిందకే వస్తాయి. ఇందులో భాగంగానే టీసీఎస్, విప్రో వంటి సంస్థలు.. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, విద్యా రంగానికి సేవ చేస్తున్నాయి.

 ప్రత్యేక విభాగం:
 ప్రస్తుతం అన్ని రకాల కార్పొరేట్ కంపెనీలు, ఎంఎన్‌సీలలో సీఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాయి/చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయా సంస్థల్లో మిగతా విభాగాల మాదిరిగానే ఇది విడదీయరాని, తప్పనిసరి భాగమైందని చెప్పొచ్చు. ఆయా కంపెనీలు సీఎస్‌ఆర్ నిర్వహణకు సంబంధించి తేడాలు ఉంటాయి. కొన్ని కంపెనీల్లో సీఎస్‌ఆర్‌ను హెచ్‌ఆర్ విభాగం పర్యవేక్షిస్తుంటే, మరి కొన్ని కంపెనీల్లో ఎన్విరాన్‌మెంటల్ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు.

 అర్హతలు ఇవి:
 సమాజం, మావన సంబంధాలను అంతర్లీనంగా అవగాహన చేసుకునే నైపుణ్యం, సంబంధిత అంశాల్లో అకడమిక్ అర్హతలు ఉన్న వారిని కంపెనీలు సీఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం నియమించుకుంటున్నాయి. ఈక్రమంలో సీఎస్‌ఆర్ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి దోహదం చేసే కోర్సులు

 ఎంబీఏ రూరల్ డెవలప్‌మెంట్
 మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ)
 పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్

 ఆయా విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలు చేసిన వారికి కూడా కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. కాకపోతే వీరి సంఖ్య చాలా స్వల్పంగానే ఉంటుందని చెప్పొచ్చు. పీజీ విద్యార్థులకు ప్రాధాన్యం లభిస్తుంది.

 కొన్ని రంగాల్లో:
 అన్ని రకాల కంపెనీల్లో సీఎస్‌ఆర్ విభాగాలున్నప్పటికీ.. కొన్ని సంస్థలు మాత్రం ఇతర సంస్థల కంటే విస్తృత స్థాయిలో సీఎస్‌ఆర్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ప్రకృతిని నేరుగా ప్రభావితం చేసే రంగాలైన మైనింగ్, మాన్యుఫాక్చరింగ్, పవర్ జనరేషన్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు ఈ కోవలోకి వస్తాయి.

 కావల్సిన స్కిల్స్:
 సీఎస్‌ఆర్ అనేది వ్యక్తిగతమైన వ్యవహారం కాదు. సమష్టిగా, జట్టుగా, సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. ఈ నేపథ్యంలో సమాజాన్ని అవగాహన చేసుకోవడం, భాగస్వామ్యాలను నిర్మించే నైపుణ్యం, స్టేక్ హోల్డర్లతో చక్కని సంబంధాలను కలిగి ఉండడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం వంటి అంశాలాధారంగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. అవి..
 బిజినెస్ స్కిల్స్ (కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్ణయాత్మక సామర్థ్యం, వినూత్న ఆలోచన, నాయకత్వ లక్షణాలు, సంక్లిష్టతను తట్టుకునే సామర్థ్యం, సమస్యను సాధించడంలో నేర్పు)
 పీపుల్ స్కిల్స్ (భిన్న పరిసరాలకనుగుణంగా ఒదిగి పోవడం, దయ, విశాల దృక్పథం, ఇతరులను ప్రభావితం చేసే నేర్పు, సామాజిక అవగాహన, సహ భాగస్వామ్యాన్ని నిర్మించే తత్వం, జట్టుగా పని చేసే నేర్పు, ప్రశ్నించే తత్వం)
 టెక్నికల్ స్కిల్స్ (వివిధ అంశాల ప్రభావాన్ని అంచనా వేయడం, స్టేక్ హోల్డర్లతో చర్చించే నైపుణ్యం, మానవ హక్కులు, ధారణత (సస్టైనబిలిటీ) వంటి అంశాలను అవగాహన చేసుకునే నేర్పు)

 విస్తృతంగా:
 ప్రస్తుతం అన్ని కంపెనీలు/వ్యాపార సంస్థల్లో సీఎస్‌ఆర్ భాగంగా మారడంతో సంబంధిత అర్హతలు ఉన్న వారికి అవకాశాలు కూడా విస్తృత స్థాయిలో పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఆసియా ఖండంలో కార్పొరేట్ వ్యవస్థల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మొదటి మూడు దేశాల్లో భారతదేశం ఒకటి కావడం కూడా సీఎస్‌ఆర్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెంచింది.

 వీరికి రూరల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ మొబిలైజేషన్, మేనేజింగ్ కలెక్టివ్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం పని చేసే వివిధ ప్రైవేట్ సంస్థల్లో, ఎన్‌జీవోలలో ఉపాధి అవకాశాలు లభించవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల ప్రాజెక్ట్‌లకు సంబంధించి భూ సేకరణలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడానికి, పునరావాస (రీసెటిల్‌మెంట్ అండ్ రిహాబలిటేషన్ -ఆర్ అండ్ ఆర్) సంబంధ అంశాలను పక్కాగా అమలు చేయడానికి కూడా సీఎస్‌ఆర్ విభాగం సేవలను కంపెనీలు వినియోగించుకుంటున్నాయి.

 సంస్థలివే:
 సీఎస్‌ఆర్‌కు సంబంధించి పబ్లిక్, ప్రైవేట్, ఎన్‌జీవో సంస్థల్లో అధిక శాతం ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), ఆంతర్జాతీయ సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ అసోసియేషన్స్, కార్పొరేట్/వ్యాపార సంస్థలు, ఎంఎన్‌సీలు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా సీఎస్‌ఆర్ కోసం సంబంధిత మానవ వనరులను నియమించుకుంటున్నాయి.

 జాబ్ ప్రొఫైల్:
 పని చేసే సంస్థ, నిర్వహించే ప్రాజెక్ట్‌లను బట్టి వివిధ హోదాలు ఉంటాయి. అవి.. కేపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఫీల్డ్ కో-ఆర్డినేటర్, అకడమిక్ రిసోర్సెస్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, ప్రోగ్రామ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టే ముందు దాని మూలాలను అన్వేషించి.. పరిష్కారం కనుక్కునే క్రమంలో కావల్సిన వనరులు, సాంకేతిక నైపుణ్యం, సంప్రదింపులు, తదితర అంశాలను దశల వారీగా ప్రణాళిక ప్రకారం అమలు చేయడానికి ఈ నిపుణులు కృషి చేస్తారు.

 వేతనాలు ఇలా:
 మీరు ఏ కంపెనీలో ఎటువంటి విభాగంలో పని చేయాలనుకుంటున్నారు అనే అంశం మీద వేతనాలు ఆధారపడి ఉంటాయి. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో ఉండే కో-ఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.15 నుంచి 20 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ. 30 నుంచి రూ. 50 వేలకు పైగానే సంపాదించవచ్చు.

 సోర్సెస్:
 సీఎస్‌ఆర్ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీ, ఫౌండేషన్, ట్రస్ట్ వెబ్‌సైట్ ద్వారా సంబంధిత ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని కంపెనీలు వివిధ పత్రికల్లో ప్రకటనలను ప్రచురించడం ద్వారా రిక్రూట్ చేసుకుంటాయి. జాబ్ పోర్టల్స్ ద్వారా కూడా సంబంధిత సమాచారాన్ని పొందొచ్చు.

 దీర్ఘకాలిక వ్యూహం:
 సీఎస్‌ఆర్‌కు సంబంధించిన చాలా విభాగాల్లో పని చేయడానికి స్పెషలిస్ట్ నాలెడ్జ్‌తోపాటు అనుభవం కూడా అవసరం. ఈ తరహా నేపథ్యం ఉన్న వారినే నియమించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతనిస్తాయి. కాబట్టి తదనుగుణంగా దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలి. కంపెనీలు ఆశించిన స్కిల్స్, అనుభవాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం ఏదైనా సంస్థ ఆఫర్ చేసే ఇంటర్న్‌షిప్ లేదా ఏదైనా
 ఎన్‌జీవో చేపట్టే ప్రాజెక్ట్‌లో స్వచ్ఛందంగా పని చేయడం ద్వారా అనుభవాన్ని గడించే అవకాశం ఉంది. అంతేకాకుం డా సంబంధిత అంశంలో చోటు చేసుకుంటున్న పరిణమాలను నిరంతరంగా గమనిస్తూండాలి. ఇందుకోసం ఆన్‌లైన్ సోర్స్, పత్రిలకలను మాధ్యమంగా ఉపయోగించుకోవాలి.

 సీఎస్‌ఆర్ కాన్సెప్ట్ వల్ల సోషల్ వర్క్ విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి. సోషల్ వర్క్‌కు సంబంధించి మెడికల్ సైకియాట్రిక్, కమ్యూనిటీ మొబిలైజేషన్, ఉమెన్ వెల్ఫేర్, హెచ్‌ఆర్‌ఎం తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీరికి ఎన్‌జీఓలు, పారిశ్రామిక సంస్థలు, హాస్పిటల్స్, కార్పొరేట్ సంస్థలు, స్కూల్స్‌తోపాటు ప్రభుత్వ విభాగాలు సాంఘిక సంక్షేమ శాఖ, వెలుగు ప్రాజెక్ట్‌లలో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో రూ. 8 వేల నుంచి 20 వేల మధ్య వేతనాలు అందుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మా యూనివర్సిటీలో సోషల్ వర్క్ కోర్సు హాట్ కేక్. ఈ కోర్సు చేసిన వారికి 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.

 -డా॥అశోక్ కుమార్,
 అసిస్టెంట్ ప్రొఫెసర్,
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.

 ఒక సమస్యను ప్రాథమిక దశలోనే అంచనా వేయడానికి, దానికి పరిష్కారం కనుక్కునే క్రమంలో సంబంధిత ప్రజలు, ఇతర పక్షాలతో భాగస్వామ్యం నెలకొల్పడం వంటి లక్షణాలు  సోషల్ వర్క్ నిపుణులకు ఉండాలి. కార్పొరేట్ కంపెనీల్లో సీఎస్‌ఆర్ తప్పనిసరిగా మారిన నేపథ్యంలో సంబంధిత నిపుణులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయని చెప్పొచ్చు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్‌జీఓ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాల్లో సోషల్ అడిటింగ్, కమ్యూనిటీ మొబిలైజేషన్ వంటి విధులను నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది.

 ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం పీజీ స్థాయిలో ఉండే సోషల్ వర్క్, సంబంధిత కోర్సులను ఎంచుకోవాలి. సమాజాన్ని ప్రొఫెషనల్ దృక్ఫథంతో అవగాహన చేసుకోవడానికి సోషల్ వర్క్ కోర్సులు ఉపయోగపడతాయి. పీజీ తర్వాత సంబంధిత అంశంలో ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. కేవలం ఏదో ఒక వర్గానికి పరిమితం కాకుండా అన్ని రకాల వ్యక్తులతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. సమాజ మార్పు దిశగా ఆలోచించే తత్వం, ఆశావహ దృక్ఫథం, ప్రజలతో స్నేహంగా వ్యవహరించే సామర్థ్యం ఉన్న వారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు.
 -ప్రొఫెసర్ లక్ష్మి లింగం,
 డిప్యూటీ డెరైక్టర్, టిస్-హైదరాబాద్ క్యాంపస్.

 ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
 వెబ్‌సైట్: www.tiss.edu
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్-ఆనంద్
 వెబ్‌సైట్: www.irma.ac.in
 జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్-రాంచీ
 వెబ్‌సైట్: www.xiss.ac.in
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్-హైదరాబాద్
 వెబ్‌సైట్: www.nird.org.in
 జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-భువనేశ్వర్
 వెబ్‌సైట్: www.ximb.ac.in
 గాంధీ గ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్-తమిళనాడు
 వెబ్‌సైట్: www.ruraluniv.ac.in
 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.ignou.ac.in
 విశ్వభారతి-పశ్చిమ బెంగాల్
 వెబ్‌సైట్: www.visvabharati.ac.in
 ఢిల్లీ యూనివర్సిటీ
 వెబ్‌సైట్: www.du.ac.in
 ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు
 వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
ఎంబీఏ (మీడియా మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
 -రచన, అమలాపురం.
 మీడియూ రంగంలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి ఫ్రంట్-ఎండ్ ఆపరేషన్స్‌తోపాటు సర్క్యులేషన్, షెడ్యూలింగ్, యూడ్ సేల్స్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, మీడియా ప్లానింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ సాగుతోంది. అలాంటి ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే కోర్సే ‘మీడియూ మేనేజ్‌మెంట్’. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సాధారణంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఇంటర్నెట్, వెబ్‌సైట్‌లను నిర్వహించే సంస్థలు, పబ్లికేషన్స్ సంస్థలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ఉపాధి అవకాశాలుంటాయి. సాధారణంగా వీరి ప్రారంభ వేతనం నెలకు రూ.15,000-30,000 మధ్య ఉంటుంది.
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 శ్రీ పద్మావతి వుహిళా విశ్వవిద్యాలయుం- తిరుపతి. వెబ్‌సైట్: www.spmvv.ac.in/
 ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్- నోయిడా.    
 వెబ్‌సైట్: www.aaft.com
 దేవి అహల్య విశ్వవిద్యాలయ - ఇండోర్
 వెబ్‌సైట్: www.emrcdavv.edu.in
 ఇన్‌స్టిట్యూట్ ఫర్ మీడియా మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్టడీస్ - న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.imcsindia.com
 మణిపాల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ - బెంగళూరు. వెబ్‌సైట్: www.manipal.edu
 అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్-నోయిడా
 వెబ్‌సైట్: www.amity.edu
 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ- న్యూఢిల్లీ.
 వెబ్‌సైట్: www.ignou.ac.in



 మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలు?
 -హుస్సేన్, అనంతపురం.
 మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)-అహ్మదాబాద్
 కోర్సు: ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
 అర్హత: 55 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్ లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
 వివరాలకు: www.iimahd.ernet.in
 ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
 కోర్సు: పీహెచ్‌డీ ఇన్ మేనేజ్‌మెంట్ (పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్)
 అర్హత: సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీతోపాటు సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్ట్‌లో ఎంఫిల్ లేదా యూజీసీ-సీఎస్‌ఐఆర్/నెట్/గేట్/రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్‌లో క్వాలిఫై లేదా యూజీసీ/సీఎస్‌ఐఆర్/ప్రభుత్వ ఆర్గనైజేషన్ నుంచి రీసెర్చ్ ఫెలోషిప్ లేదా నిర్దేశించిన విధంగా యూనివర్సిటీ గుర్తించిన జర్నల్స్‌లో రీసెర్చ్ పేపర్లు ప్రచురితం అయి ఉండాలి.
 వివరాలకు: www.osmania.ac.in
 అన్నా యూనివర్సిటీ-చెన్నై
 వివరాలకు: www.annauniv.edu


  ఎంఎస్సీ (ఫిజిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలేవి?  
 -రాజేశ్, ఖమ్మం.

 ఐఐటీ-ఢిల్లీ (వెబ్‌సైట్: www.iitd.ac.in), ముంబై (వెబ్‌సైట్: www.iitb.ac.in), రూర్కీ (వెబ్‌సైట్: www.iitr.ac.in), కాన్పూర్ (వెబ్‌సైట్: www.iitk.ac.in), మద్రాస్ (వెబ్‌సైట్: www.iitm.ac.in) ఫిజిక్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు ఎంఎస్సీ ఫిజిక్స్, జాయింట్ ఎంఎస్సీ - పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఇన్ ఫిజిక్స్, ఎంఎస్సీ - పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఫిజిక్స్, ఎంఎస్సీ(ఫిజిక్స్)-ఎంటెక్ (మెటీరియల్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ నానోసైన్స్ అండ్ టెక్నాలజీ) పేర్లతో పీజీ స్థాయిలో ఫిజిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐఐటీ-జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (్జ్చఝ) పరీక్షకు హాజరు కావాలి. అర్హత: మ్యాథమెటిక్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ. జామ్ పరీక్ష ఆబ్జెక్టివ్ కమ్ డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఈ క్రమంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ (ఖాళీలను పూరించడం), డిస్క్రిప్టివ్ ఎస్సే ప్రశ్నలు వస్తాయి.
 జామ్-2014కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 16, 2013.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 16, 2013.
 పరీక్ష తేది: ఫిబ్రవరి 9, 2014. వెబ్‌సైట్: www.iitk.ac.in/jam


 ఎంఎస్సీ(అగ్రికల్చరల్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?    
 -శ్యామ్, హైదరాబాద్.

 మన రాష్ట్రంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 12 రకాల డిసిప్లెయిన్స్‌తో ఎంఎస్సీ(అగ్రికల్చరల్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: బీఎస్సీ(సీఏబీఎం)లేదా బీఎస్సీ (అగ్రికల్చరల్). ఇవేకాకుండా ఎంఎస్సీ(అగ్రికల్చర్ బయోటెక్నాలజీ), ఎంఎస్సీ (అగ్రి విత్ వాటర్ మేనేజ్‌మెంట్), ఎంటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), మాస్టర్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులను కూడా ఈ వర్సిటీ అందిస్తుంది.
 వివరాలకు: www.angrau.ac.in

 యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర-బెంగళూరు, వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ(అగ్రికల్చరల్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఎంటెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విత్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్/పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెస్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్) కోర్సులను కూడా అందిస్తుంది.
 వివరాలకు: www.uasbangalore.edu.in
 సామ్ హిగ్గిన్‌బాథమ్ (అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్ , ఇది డీమ్డ్ యూనివర్సిటీ) వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ (అగ్రికల్చరల్), ఎంబీఏ (అగ్రిబిజినెస్) కోర్సులను ఆఫర్ చేస్తుంది.
 వివరాలకు: www.shiats.edu.in

కొత్త కొలువులు @ సైబర్ లా

నా బ్యాంకు ఖాతాలోంచి రూ. 30 వేలు
 మాయమయ్యాయి!
 - ఓ కార్పొరేట్ సంస్థ ఉద్యోగి ఆవేదన

 ఎవరో నా పేరుతో ‘ఫేస్‌బుక్’లో నకిలీ అకౌంట్ తెరిచారు!
 - ఓ బాలీవుడ్ హీరోయిన్ ఫిర్యాదు

 నా ఈ-మెయిల్‌కు అసభ్యకర ఫొటోలు పంపిస్తున్న వారిని పట్టుకోండి!
 - ఓ కాలేజీ యువతి విజ్ఞప్తి

 ‘సైబర్ లాస్’ కెరీర్‌లో రాణించాలంటే అవసరమైన స్కిల్స్

 సమస్యను విశ్లేషించి, పరిష్కార మార్గాలను సూచించగలగడం.
 సైబర్ స్పేస్‌కు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ చట్టాలపై అవగాహన.

 ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఒంటబట్టించుకోవడం.

 ఇప్పుడు ఇలాంటి కేసులెన్నో పోలీసుల ముందుకు వస్తున్నాయి. రోజురోజుకూ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటం, నెట్ ఆధారిత సేవలు విస్తరిస్తుండటంతో సైబర్ నేరాలు, వివాదాలు అధికమవుతున్నాయి. దీంతో సైబర్ న్యాయ నిపుణుల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సైబర్ లా’ తో కెరీర్ ఆప్షన్స్‌పై స్పెషల్ ఫోకస్..

 ఇంటర్నెట్‌కు సంబంధించిన వర్చువల్ ప్రపంచమే ‘సైబర్ స్పేస్’. దీనికి సంబంధించిన చట్టాలే సైబర్ లాస్.. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలు బాగా విస్తరిస్తున్నాయి. ఈ-బిజినెస్, ఈ-గవర్నెన్స్, ఈ-ప్రొక్యూర్‌మెంట్.. ఇలా వివిధ రకాల కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇలా వివిధ రూపాల్లో ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దుర్వినియోగపరిచే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. క్రెడిట్ కార్డు, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ తదితరాలకు సంబంధించిన మోసాలతో పాటు హ్యాకింగ్, బ్లాక్ మెయిలింగ్, పోర్నోగ్రఫీ వంటి అనైతిక కార్యకలాపాలు బయటపడుతున్నాయి.

 భారత్ పరిస్థితి:
 ఒక్క భారత్‌లోని పరిస్థితిని గమనిస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2011లో ఐటీ చట్టం కింద 1,791 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా, 2012లో ఈ సంఖ్య 2,876కు చేరింది. ఇలా దేశంలో ఏటికేడు పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. సాంకేతిక మౌలిక వసతులను మెరుగుపరచుకోవాలని, సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, నేరాల గుర్తింపు, నమోదు, పరిశోధన, ప్రాసిక్యూషన్‌లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించినట్లు ఇటీవల కేంద్రం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ న్యాయ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. సైబర్ లాస్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలుంటున్నాయి.

 సైబర్ లాస్-కోర్సులు:
 దేశంలో సైబర్ లాస్‌కు సంబంధించి డిప్లొమా, పీజీ డిప్లొమా వంటి కోర్సులతో పాటు పీజీ స్థాయి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ‘పీజీ డిప్లొమా ఇన్ సైబర్ లాస్’ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లా డిపార్ట్‌మెంట్ కూడా సైబర్ లాస్‌లో పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. 60 సీట్లు నాన్ స్పాన్సర్డ్ అభ్యర్థులకు, 20 సీట్లు స్పాన్సర్డ్ అభ్యర్థులకు కేటాయించారు.

 పుణేలోని ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లాస్.. డిప్లొమా ఇన్ సైబర్ లా, అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్ ఇన్ సైబర్ లాస్, పీజీ ప్రోగ్రామ్ ఇన్ సైబర్ లాస్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
 రెగ్యులర్‌తో పాటు దూరవిద్య ద్వారా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు ఆన్‌లైన్ విధానంలో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

 కోర్సులో చేరాలంటే:
 డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేషన్‌ను అర్హతలుగా నిర్దేశిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరాలంటే ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉండాలి. కొన్ని విద్యా సంస్థలు నేరుగా ప్రవేశాలు కల్పిస్తుండగా, మరికొన్ని ఎంట్రెన్స్ పరీక్షలో ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

 రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో కరెంటు అఫైర్స్; కామర్స్, సైన్స్, ఆర్ట్స్; లా అవేర్‌నెస్‌లపై ప్రశ్నలు ఉంటాయి.

 కోర్సులో బోధించే అంశాలు:
 సైబర్ న్యాయ నిపుణులుగా రాణించాలంటే లాతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలపైనా పరిజ్ఞానం సంపాదించడం అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరిక్యులంను రూపొందిస్తున్నారు. లా, టెక్నాలజీలకు సంబంధించిన అంశాలు; లా ఆఫ్ డిజిటల్ కాంట్రాక్ట్స్; సైబర్ స్పేస్‌లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ; నెటిజన్ల హక్కులు; ఈ-గవర్నెన్స్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం; సైబర్ చట్టాలు (జాతీయ, అంతర్జాతీయ); కాపీరైట్, పేటెంట్‌లు, ట్రేడ్‌మార్క్స్, డేటా బేస్ వంటి అంశాలను బోధిస్తారు.

 నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా.. సైబర్ లా పీజీ డిప్లొమా కోర్సు కరిక్యులంలో కొన్ని అంశాలు...
 డిఫైనింగ్ సైబర్ స్పేస్, జ్యురిస్‌డిక్షన్ ఇన్ సైబర్ స్పేస్.
 అండర్‌స్టాండింగ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్.
 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్.
 సైబర్ కాంట్రాక్ట్స్ అండ్ ఇండియన్ లీగల్ పొజిషన్.
 అండర్‌స్టాండింగ్ కాపీరైట్ ఇన్ ఐటీ.
 లీగల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నెట్ అండ్ సాఫ్ట్‌వేర్ కాపీరైట్.
 పేటెంట్స్, ట్రేడ్‌మార్క్స్, డేటాబేసెస్.
 ఈ-కామర్స్, ఈ-బ్యాంకింగ్, సైబర్ క్రైమ్స్, ఇంటర్నెట్ గవర్నెన్స్.

 అదనపు అర్హతతో ఉత్తమ కెరీర్:
 ఇప్పటికే న్యాయవాద వృత్తిలో ఉన్నవారు సైబర్ లాస్ కోర్సుల్లో చేరి ఉన్నత కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు. ఇదే విధంగా సైబర్ లాస్ కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసుకునేందుకు అవకాశమున్న వారు మరికొందరు కూడా ఉన్నారు.
 వారు..
 ఐటీ స్టూడెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్.
 పోలీస్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.
 ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్.
 నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్స్.
 మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్.
 చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్.
 కామర్స్ స్టూడెంట్స్.

 కెరీర్ అవకాశాలు:
 సైబర్ లాస్ కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసిన వారికి వివిధ కెరీర్ అవకాశాలు ఆహ్వానం పలుకుతాయి. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ సంస్థలు ఉద్యోగాలను అందుబాటులో ఉంచుతున్నాయి.
 అవి:
 శాంతిభద్రతలు, నిఘా విభాగాలు.
 ఐటీ సంస్థలు, కార్పొరేట్ హౌస్‌లు.
 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.
 న్యాయ సేవల సంస్థలు.
 టెక్నాలజీ సంబంధిత సంస్థలు.
 లా స్కూల్స్, విశ్వవిద్యాలయాలు.

 ఏయే ఉద్యోగాలు ఉంటాయి:
 సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారు వివిధ అవకాశాలను చేజిక్కించుకొని కెరీర్‌లో స్థిరపడొచ్చు. లా డిగ్రీ కూడా ఉంటే ఉన్నత కొలువులు పలకరిస్తాయి. అవి:
 సైబర్ కన్సల్టెంట్.
 ఇంటర్నెట్ రీసెర్చ్ అసిస్టెంట్, లా అడ్వైజర్.
 లీగల్ ఎగ్జిక్యూటివ్, లా ఆఫీసర్, లీగల్ సెక్రటరీ.
 సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్, సైబర్ రీసెర్చ్ మేనేజర్స్.
 ట్రైనింగ్ ఎక్స్‌పర్ట్స్, అడ్వైజర్స్ టు వెబ్ డెవలపర్స్.
 సెక్యూరిటీ ఆడిటర్స్, రీసెర్చ్ అసిస్టెంట్స్.
 లా డిగ్రీతోపాటు సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

 వేతనాలు:
 వేతనాలనేవి అభ్యర్థి విద్యార్హతలు, వ్యక్తిగత సామర్థ్యం, పనిచేసే సంస్థ తదితరాలపై ఆధారపడి ఉంటాయి.
 సైబర్ లా కోర్సులు పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరిన వారి ప్రారంభ వేతనం నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది.
 ఓ కార్పొరేట్ లేదా లా సంస్థలో కన్సల్టెంట్‌గా చేరిన వారికి రూ. 22 వేల నుంచి రూ. 25 వేల వరకు ఆఫర్ చేస్తున్నారు.
 పని అనుభవం, వ్యక్తిగత సామర్థ్యంతో ఉన్నత స్థానాలను చేరుకొని రూ. 40 వేల వరకు అందుకోవచ్చు.
 మంచి నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి.

 ‘సైబర్ లాస్’ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది
 ఓ జాతి, సమాజం అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ-కామర్స్, ఈ-గవర్నెన్స్ వంటి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తూ అక్రమాలకు పాల్పడుతున్న కేసులు, వివాదాలు అధికమవుతున్నాయి. అందుకే సైబర్ న్యాయ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.

 దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం దేశంలోని వివిధ విద్యా సంస్థలు సైబర్ లాస్‌కు సంబంధించిన కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని లా డిపార్ట్‌మెంట్ ఏడాది కాల వ్యవధితో సైబర్ లాస్‌లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి, సీట్లను భర్తీ చేస్తున్నాం. కోర్సులో భాగంగా లాస్‌తో పాటు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, ఎలక్ట్రానిక్ ఒప్పందాలు, ఈ-గవర్నెన్స్, ఈ-కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం; సైబర్ చట్టాలు (జాతీయ, అంతర్జాతీయ); కాపీరైట్, పేటెంట్‌లు, ట్రేడ్‌మార్క్స్, డేటా బేస్ వంటి అంశాలను బోధిస్తారు.

 సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్, ఐటీ, పోలీస్ డిపార్ట్‌మెంట్స్, కార్పొరేట్ హౌస్‌లు వంటి వాటిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇప్పుడు కంపెనీలు టెక్నాలజీ ఆధారంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయి. సైబర్ న్యాయ నిపుణులు నెట్ బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ పేటెంట్స్, కాపీరైట్స్ తదితరాలకు సంబంధించిన కేసులను పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, న్యాయ సంబంధ విషయాలపై పట్టుండి, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సమస్య విశ్లేషణ శక్తి ఉన్నవారు ఈ రంగంలో రాణించగలరు.
 - డాక్టర్ బి. విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్,
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా (ఓయూ).

 సైబర్ లాస్ కోర్సులు అందిస్తున్న సంస్థలు
 ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లా  
 వెబ్‌సైట్: www.asianlaws.org
 నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా
 వెబ్‌సైట్: www.nalsarpro.org
 ఉస్మానియా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: www.osmania.ac.in/lawcollege
 ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్
 వెబ్‌సైట్: www.ili.ac.in
 నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: ded.nls.ac.in
 సింబయోసిస్ సొసైటీస్ లా కాలేజ్
 వెబ్‌సైట్: www.symlaw.ac.in
 సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)
 వెబ్‌సైట్: www.uohyd.ac.in

అగ్రికల్చరల్ కోర్సులు.. అవకాశాలెన్నో..!!

అగ్రికల్చరల్ కోర్సులు.. మెడికల్ కోర్సుల తర్వాత ఎంసెట్ ఉత్తీర్ణులకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న కోర్సులు. అగ్రికల్చరల్ కోర్సులను ప్రత్యామ్నాయ కోర్సులుగా భావించకుండా.. ప్రధానమైన కోర్సులుగా పరిగణించాలని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.పద్మరాజు సూచిస్తున్నారు. అగ్రికల్చరల్ కోర్సులతో భవిష్యత్‌లో బహుళ ప్రయోజనాలు ఉంటాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, వ్యవసాయ సంబంధ కోర్సులకు కౌన్సెలింగ్ జరుగుతున్న తరుణంలో..  అగ్రికల్చరల్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఎ.పద్మరాజుతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

 ప్రధాన కోర్సులుగానే పరిగణించాలి:
 ఎంసెట్ (అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్) ఉత్తీర్ణుల్లో అధిక శాతం విద్యార్థులు ముందుగా మెడికల్ కోర్సులను లక్ష్యంగా పెట్టుకుంటారనేది నిస్సందేహం. వాటిలో అవకాశం రాకపోతే అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల వైపు దృష్టిసారిస్తారు. కానీ ఇదే సమయంలో గమనించాల్సిన అంశం.. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. మా యూనివర్సిటీ నిర్వహించిన గత కంబైన్డ్ యూజీ కౌన్సెలింగ్‌లో అన్ని కోర్సుల్లోనూ.. మూడు రీజియన్లు(ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ)లోనూ ఓపెన్ కేటగిరీలో నాన్-ఫార్మర్ కోటాలో 15 వేల లోపు ర్యాంకుతోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయి.


 రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని లాస్ట్ ర్యాంకులతో పోల్చితే అంతే ప్రాధాన్యం అగ్రికల్చరల్ కోర్సులకు కూడా లభిస్తోందనే విషయం స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులోని మొత్తం 30 సీట్లు భర్తీ అయ్యాయి. దీన్నిబట్టిచూస్తే.. అగ్రికల్చర్, సంబంధిత కోర్సులు కేవలం ప్రత్యామ్నాయ కోర్సులు కాదని.. వీటిని ప్రధాన కోర్సులుగానే పరిగణించాలనే విషయం స్పష్టమవుతుంది. ఈ కోర్సులకు లభిస్తున్న ఆదరణను పరిగణనలోకి తీసుకుని బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ఇప్పటికే ఉన్న సీట్లకు అదనంగా 75 సీట్లను పెంచాం.


 బీటెక్ అగ్రికల్చర్ ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా:
 ఇంటర్మీడియెట్ ఎంపీసీ అర్హతగా యూనివర్సిటీ అందిస్తున్న బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులో సీట్లను ఎంసెట్-ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తాం. ఈ కోర్సులో చేరదలచుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం.. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఇంజనీరింగ్ నైపుణ్యాలతో అనుసంధానం చేసి, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని మరింత పెంచడం. ఈ నెల పదో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా కొత్త విద్యా సంవత్సరంలో క్లాసుల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం.


 థియరీతోపాటు ప్రాక్టికల్ అప్రోచ్:
 కొత్త విద్యా సంవత్సరంలో అగ్రికల్చరల్ సంబంధిత కోర్సుల్లో చేరే విద్యార్థులు తొలిరోజు నుంచే ప్రాక్టికల్ దృక్పథంతో అడుగులు వేయాలి. కరిక్యులం కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. కేవలం క్లాస్‌రూం లెర్నింగ్, సెల్ఫ్ స్టడీకి పరిమితం అవుదాం అనే ధోరణితో రాణించలేరు. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలి. తోటి విద్యార్థులతో కలిసి కంబైన్డ్ స్టడీస్ సాగించడం కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్త అంశాలు, అర్థం కాని విషయాలపై కంబైన్డ్ స్టడీతో స్పష్టత లభిస్తుంది.


 బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల విద్యార్థులకు క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన కల్పించేందుకు యూనివర్సిటీ చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం.. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం (RAWEP). ఒక రకంగా ఇది ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం వంటిది. ఇందులో భాగంగా నాలుగేళ్ల వ్యవధిగల కోర్సులో చివరి సెమిస్టర్‌లో ఆరు నెలలపాటు విద్యార్థులు ఆయా గ్రామాల్లో వ్యవసాయదారులు, వ్యవసాయ క్షేత్రాల్లో జరిగే కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం.. అప్పటికే తాము తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అనుసంధానం చేయడం.. వ్యవసాయదారులకు తగిన సలహాలు, సూచనలు అందించడం వంటివి చేయాలి.


 ఫలితంగా విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే వాస్తవ పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. దేశంలోనే ఇలాంటి ప్రోగ్రాంను అందిస్తున్న తొలి యూనివర్సిటీ ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్సిటీ. కరిక్యులం విషయంలోనూ నిరంతరం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తెస్తూ విద్యార్థులు అప్‌డేటెడ్‌గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్యాంపస్ నుంచి పీజీ చదివి గేట్ ర్యాంకుల ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందిన పూర్వ విద్యార్థులే ఇక్కడి బోధన ప్రమాణాలకు నిదర్శనం.


 వాస్తవాలను ప్రతిబింబించేలా:
 యూజీ కోర్సుల విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందించే క్రమంలో వాస్తవాలను ప్రతిబింబించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. నారుమళ్లు వేయడం, నాగలి పట్టి దుక్కిదున్నడం మొదలు నిర్ణీత ఉత్పత్తి చేతికందే వరకూ.. ప్రాక్టికాలిటీ దిశగా ఆయా కాలేజీల క్యాంపస్‌లలోనే పంటలు పండించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలా ప్రతి దశలోనూ ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యమిస్తూ విద్యార్థులు పరిపూర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం.


 సీఏబీఎం సిలబస్‌లో మార్పు :
 వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు సిలబస్ మార్చాలని ఆలోచిస్తున్నాం. ఈ కోర్సులో అధిక శాతం మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. ఈ కోర్సంటే పూర్తిగా అగ్రికల్చర్ సంబంధిత కోర్సు అనే అభిప్రాయం తొలగించి అగ్రికల్చర్, బిజినెస్ మేనేజ్‌మెంట్ రెండు అంశాల సమ్మిళితంగా రూపొందించాలన్నదే ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తులో ఉపాధి దిశగా ఆయా వ్యవసాయ ఉత్పత్తుల సంస్థల్లో చేరే విద్యార్థులు సంస్థల్లో ఉత్పత్తి, నిర్వహణ విభాగాల్లో సమర్థంగా రాణించేందుకు వీలవుతుంది.


 పరిశోధనలకు ప్రాధాన్యం:
 ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీ చేపడుతున్న కార్యకలాపాల్లో ప్రధానమైంది పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వంటి కారణాలతో కాలుష్యం స్థాయి అంతకంతకూ పెరిగి.. అది వ్యవసాయంపై ప్రభావం చూపుతోంది. కాలుష్యాన్ని తట్టుకుని పంటల దిగుబడి పెంచేలా పలు పరిశోధన ప్రాజెక్టులు చేపడుతున్నాం.


 ఈ క్రమంలో పలు పంటల విషయంలో దేశంలోనే తొలిసారిగా 302 రకాలను ఆవిష్కరించాం. అంతేకాకుండా తక్కువ వ్యయంతో పంటల దిగుబడి సాధించే టెక్నాలజీల ఆవిష్కరణ కూడా చేశాం. అనేక పారిశ్రామిక సంస్థలు పరిశోధనల విషయంలో యూనివర్సిటీతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయంటేనే పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.



 పలు దేశాలతో ఎక్స్చేంజ్ ఒప్పందాలు:
 కేవలం మన దేశ వ్యవసాయ పద్ధతుల గురించే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు పలు దేశాలకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌లతో ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఒప్పందాలు కూడా చేసుకున్నాం. ఒక్క అమెరికాలోనే 20 ఇన్‌స్టిట్యూట్స్‌తో ఇలాంటి ఒప్పందం ఉంది. మన దేశంలోనూ ఐఐటీ-బాంబే, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదిరాయి.


 ‘ఐటీ’తో అనుసంధానం దిశగా:
 అన్ని రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. అగ్రికల్చరల్ కోర్సులను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీతో ఎంఓయూ కుదిరింది. దీంతోపాటు భవిష్యత్తులో దూర విద్యా విధానంలో వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్‌లో స్వల్పకాలిక కోర్సును ప్రారంభించాలనే యోచనలో ఉన్నాం.


 ఇది త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. అదేవిధంగా పీజీ స్థాయిలోనూ పలు కొత్త స్పెషలైజేషన్లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే తిరుపతిలో నానోటెక్నాలజీ స్పెషలైజేషన్‌ను ప్రవేశపెట్టాం. ఇదే క్రమంలో ఆధునిక పద్ధతులకు అనుగుణంగా.. పీజీ స్థాయిలో మైక్రోబయాలజీ, బయో టెక్నాలజీ, అగ్రిమార్కెటింగ్ ఇంటెలిజెన్స్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లను ప్రారంభించాం.


 అవకాశాలు పుష్కలం:
 అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల విషయంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినప్పటి నుంచే అపార అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్లేస్‌మెంట్స్ కోణంలో చూసినా.. ఉన్నత విద్య, పరిశోధనల దృష్టితో ఆలోచించినా.. అనేక ప్రయోజనాలు వీరికి సొంతమవుతున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్‌తోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా పలు ఎంఎన్‌సీలు రూ.లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలందిస్తున్నాయి. ఉన్నతవిద్య పరంగా ఎమ్మెస్సీలో చేరితే ఫెలోషిప్ లభిస్తుంది. ఆ తర్వాత పీహెచ్‌డీ చేస్తే అవకాశాలకు ఆకాశమే హద్దు.


 ఉన్నత విద్యలో పోటీ తీవ్రం:
 ప్రస్తుతం అగ్రికల్చరల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలా? లేదా ఉద్యోగంలో చేరాలా? అనేది ఆయా విద్యార్థుల ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి తీసుకోవాల్సిన నిర్ణయం. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని విద్యార్థులు ఉద్యోగంలో చేరి కూడా దూర విద్య విధానం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.


 ఇక.. ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు యూజీలో చేరిన తొలి రోజు నుంనే అదే లక్ష్యంతో కృషి చేయాలి. పీజీ స్థాయిలో అగ్రికల్చర్ కోర్సుల సీట్లు, కాలేజీల సంఖ్య పరిమితం. కాబట్టి వాటికి పోటీ ఎంతో తీవ్రంగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవడం సాధారణ స్థాయిలో చదివే విద్యార్థులకు సాధ్యం కాదు. కాబట్టి పీజీ లక్ష్యంగా పెట్టుకుంటే దానికి తగిన రీతిలో ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుని అడుగులు వేయాలి.


 హార్డ్‌వర్క్ ముఖ్యం:
 అగ్రికల్చరల్ కోర్సులు ఇతర కోర్సులకంటే భిన్నమైనవి. తప్పనిసరిగా బురదలో, మట్టిలో పనిచేయాల్సిన విధంగా ఈ కోర్సుల స్వరూపం ఉంటుంది. అందువల్ల అగ్రికల్చరల్ కోర్సుల విద్యార్థులకు కష్టించి పనిచేసేతత్వం ఉండాలి. కోర్సు ఆసాంతం క్షేత్ర స్థాయి బోధన సమ్మిళితంగా ఉంటుంది. ముఖ్యంగా.. 30 నుంచి 40 ఏళ్ల భవిష్యత్తుకు ఈ కోర్సులు పునాది. వీటిని దృష్టిలో ఉంచుకుని విషయ పరిజ్ఞానం పెంచుకునే దిశగా నిరంతరం శ్రమించాలి. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలతో, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో పనిచేయగల నేర్పు, ఓర్పు అవసరం. ఈ లక్షణాలు అలవర్చుకుంటే అద్భుతమైన కెరీర్ సొంతమవుతుంది.

స్పెషల్ ఎడ్యుకేషన్.. ఉపాధికి లేదు ఢోకా!

ఏదో చెప్పాలనుంటుంది.. ఏమీ చెప్పలేని నిస్సహాయత. ఆకలేస్తుంది.. కానీ నోరు తెరచి అడగలేరు. పుట్టుకతోనే విధి చిన్నచూపుతో నిస్సహాయంగా కళ్లెదుట కన్నబిడ్డల వేదనచూసి ఎలా అర్థంచేసుకోవాలో తెలియక మౌనవేదన అనుభవించే తల్లిదండ్రులు మన చుట్టూ ఎందరో కనిపిస్తుంటారు. చిన్నారుల అంతరంగాన్ని అర్థం చేసుకొని.. మనందరిలాగే సాధారణ పౌరులుగా వారిని తీర్చిదిద్దడంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పాత్ర ఎంతో కీలకం. ప్రీ మెచ్యూర్డ్ బేబీస్, జెనెటికల్ డిజార్డర్స్ వంటి రకరకాల కారణాలతో ప్రత్యేక అవసరాల పిల్లల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. మన రాష్ర్టంలో మొత్తం 25 కాలేజీలు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో సుమారు 2,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

 నిపుణుల కొరత:
 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం- ప్రపంచ జనాభాలో 11 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నారు. వీరిలో 3.6 శాతం మంది సరిగా మాట్లాడలేని, వినికిడి లోపంతో ఉన్నారు. ఇంతమంది అవసరాలకు తగినట్లుగా స్పెషల్ ఎడ్యుకేషన్ నిపుణులు లేకపోవటం పెనుశాపంగా మారింది. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్‌సీఐ) అంచనా ప్రకారం- ఈ రంగంలో సేవలందించేందుకు మన దేశంలో స్పీచ్, ఆడియాలజీ విభాగంలో 4,500 మంది, స్పెషల్ టీచర్స్ 10,000 మంది అవసరం. లోపాలతో జన్మించిన పిల్లలకు సకాలంలో అవసరమైన శిక్షణను అందించకపోవడం వల్ల వారు శాశ్వత వైకల్యంతో జీవితాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది.

 పెరుగుతున్న ఆదరణ:
 మానసికంగా, శారీరకంగా ఎదగని పిల్లలను తీర్చిదిద్దేందుకు శాస్త్రీయంగా శిక్షణ పొందినవారు చాలా అవసరం. దాంతో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. చెవిటి, మూగ, మనోవైకల్యం తదితర సమస్యలకు అనుగుణంగా డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులకు ఆదరణ లభిస్తోంది. ఆయా కోర్సులు పూర్తిచేసినవారికి దేశ, విదేశాల్లోనూ ఉపాధి, ఉద్యోగావకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.


 డిప్లొమా, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ కొలువులకూ అర్హత ఉండటంతో చాలామంది ఇటువైపు దృష్టిసారిస్తున్నారు. అంతేకాకుండా.. స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకూ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపచేయడంతో మరింత ఎక్కువ మంది ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.


 కోర్సులు:
 రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్‌సీఐ) ఆధ్వర్యంలో.. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహిస్తున్నారు. విజువల్ ఇంపెయిర్‌మెంట్, హియరింగ్ ఇంపెయిర్‌మెంట్, మెంటల్ రిటార్డేషన్, లెర్నింగ్ డిజెబిలిటీ, రిహాబిలిటేషన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ, ప్రోస్థటిక్స్/ ఆర్థోటిక్స్, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, రిహాబిలిటేషన్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, స్పీచ్ అండ్ హియరింగ్, లోకోమోటర్ అండ్ సెరిబరెల్‌పాల్‌సే, ఆటిజమ్ స్పెక్ట్రమ్ అండ్ డిజార్డర్, రిహాబిలిటేషన్ థెరపీ, రిహాబిలిటేషన్ సోషల్ వర్క్/అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో... దేశవ్యాప్తంగా సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులు,డిగ్రీ కోర్సులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో పలు స్పెషల్ కోర్సులను ఆర్‌సీఐ పరిధిలోని వివిధ కళాశాలలు అందిస్తున్నాయి.

 సర్టిఫికెట్ కోర్సులు:
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కేర్ గివింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: పదో తరగతి/ఐటీఐ/10+2

 డిప్లొమా కోర్సులు:
 డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), డిప్లొమా ఫర్ ఇన్ఫర్మేషన్ అసిస్టివ్ టెక్నాలజీస్ ఫర్ ఇన్‌స్ట్రక్టర్స్ ఆఫ్ డెఫ్‌బ్లైండ్ అండ్ డెఫ్ విత్ లో విజన్, డిప్లొమా ఇన్ టీచింగ్ యంగ్(డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్), డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్(లెవెల్ ఏ,బీ,సీ), డిప్లామా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ రిపేర్ అండ్ హియర్ మౌల్డ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ బేసిక్ డెవలప్‌మెంట్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ, డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్, బ్లైండ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(సెరిబ్రల్ పాల్‌సే), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఆటిజం స్పెక్ట్రమ్).
 డిప్లొమా కోర్సుల కాలవ్యవధి: ఏడాది
 అర్హత: 10+2/ఇంటర్మీడియెట్

 ప్రవేశం: కొన్ని కోర్సులకు అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, డీఈడీ వంటి మరికొన్ని కోర్సులకు రాత పరీక్ష ఆధారంగా సంబంధిత యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నిబంధనల మేరకు ప్రవేశం కల్పిస్తారు.

 బ్యాచిలర్ కోర్సులు:
 బ్యాచిలర్ ఆఫ్ మొబిలిటీ సైన్స్(బీఎంఎస్సీ), బీఏ, బీఈడీ(విజువల్ ఇంపెయిర్‌మెంట్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్‌మెంట్), బీఎస్సీ (స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (మెంటల్ రిటార్డేషన్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (లెర్నింగ్ డిజాబిలిటీస్), బ్యాచిలర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (లోకోమోటర్ అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (మల్టిపుల్ డిజాబిలిటీస్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్), బ్యాచిలర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్.
 బీఈడీ కోర్సుల కాలవ్యవధి: ఏడాది
 అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
 ప్రవేశం: అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, లేదా ఆయా యూనివర్సిటీ నిబంధనల మేరకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

 పీజీ కోర్సులు:
 ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్‌మెంట్), ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), ఎంఎస్సీ డిజాబిలిటీ స్టడీస్(ఎర్లీ ఇంటర్వెన్సన్), మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, మాస్టర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్, ఎంఎస్సీ సైకో సోషల్ రిహాబిలిటేషన్, మాస్టర్ ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్.
 ఎంఈడీ కోర్సుల కాలవ్యవధి: ఏడాది.
 అర్హత: బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.
 ప్రవేశం: అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, లేదా ఆయా యూనివర్సిటీ నిబంధనల మేరకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

 పీజీ డిప్లొమా కోర్సులు:
 పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్స్‌న్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ ఇంజనీరింగ్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్(మల్టిపుల్ డిజాబిలిటీస్: ఫిజికల్ అండ్ న్యూరోలాజికల్), పీజీ డిప్లొమా ఇన్ డెవలప్‌మెంటల్ థెరపీ(మల్టిపుల్ డిజాబిలిటీస్: ఫిజికల్ అండ్ న్యూరోలాజికల్), పీజీ డిప్లొమా ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అండ్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సులకు వేటికవే ప్రత్యేకంగా ఆయా యూనివర్సిటీల నిబంధనల మేరకు అర్హతలు నిర్ణయించి, రాత పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

 దూరవిద్య కోర్సులు:
 బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హెచ్‌ఐ/వీఐ/ఎంఆర్/ఎల్‌ఐ అండ్ సీపీ), పీజీ ప్రొఫెషనల్ డిప్లొమా(ఇన్‌సర్వీసు టీచర్స్ కోసం, ఏడాది), పీజీ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ డిజాబిలిటీ ఫర్ డాక్టర్స్, డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, ఫౌండేషన్ కోర్సు ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ (3 నెలలు), ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ.. తదితర కోర్సులను ఇగ్నో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి.

 అవకాశాలు అనేకం:
 బాధితులు పెరుగుతున్నకొద్దీ ఆయా విభాగాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దేశ, విదేశాల్లో మూగ, చెవుడు, మానసిక వైకల్యం తదితర సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నిపుణుల సేవలు తప్పనిసరి. అందుకే కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు కార్పొరేటు, ప్రభుత్వ రంగాల్లో కొలువులు స్వాగతం పలుకుతున్నాయి.

 ఇటీవల స్పెషల్ బీఈడీ చేసిన వారికి డీఎస్సీలో అవకాశం కల్పించడంతో ఈ కోర్సుకు మరింత డిమాండ్ పెరిగింది. స్పీచ్, ఆడియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి కార్పొరేటు ఆసుపత్రుల్లో అవకాశాలు మెరుగయ్యాయి. ఎన్జీవోలు, ఆసుపత్రులు, ఆసుపత్రి నిర్వహణలో ఉపాధి లభించడంతోపాటు ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవ చేస్తున్నామనే సంతృప్తి కూడా వీరికి లభిస్తుంది. కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలో ఉండటంతోపాటు విదేశాల్లోనూ కొలువు సంపాదించే అవకాశం ఉంది.

 మన రాష్ట్రంలోనే స్పీచ్, ఆడియాలజీ విభాగంలో నెలకు రూ.16 వేల నుంచి వేతనాలు అందిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి బోధన నిపుణులుగా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిపుణులుగా రూ.20 వేల నుంచి ప్రారంభ వేతనం లభిస్తోంది. ఇక విదేశాల్లో విద్యార్హతల ఆధారంగా జీతాలు లభిస్తున్నాయి.

 ఆర్‌సీఐ పోర్టల్:
 దేశవ్యాప్తంగా రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్న విద్యాసంస్థలు, కళాశాలలు, ఫీజులు, కోర్సులకు సంబంధించిన సిలబస్ తదితర వివరాలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) వెబ్‌సైట్  http:// rehabcouncil.nic.in ద్వారా తెలుసుకోవచ్చు.

 అవకాశాలు పుష్కలం
 మానసికంగా, శారీరకంగా ఎదగని పిల్లలు, వ్యక్తులను తీర్చిదిద్దడంలో నిపుణులు చూపే ప్రేమ అనిర్వచనీయం. మనసులోకి తొంగిచూసి, అంతరంగాన్ని అర్థంచేసుకుని అలాంటి వారిని సాధారణ వ్యక్తులుగా మార్చడంలో నిపుణుల సేవలు కీలకం. ఏటేటా వైకల్యంతో జన్మిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ, అవసరాలకు అనుగుణంగా నిపుణులు లేరు. అందుకే కోర్సు పూర్తిచేసిన వారికి వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశ, విదేశాల్లో కూడా పుష్కలమైన అవకాశాలున్నాయి.

 ప్రారంభ వేతనం కూడా బాగుండటంతో యువత ఇప్పుడిప్పుడే ఈ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. సొంత ప్రాక్టీసు, ఎన్జీవోలు, ఆసుపత్రుల్లో పనిచేసే వీలుంది. సర్వశిక్షాభియాన్ ద్వారా ప్రభుత్వం కూడా వినికిడి, మూగ, మనోవైకల్యంతో బాధపడే చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది. కాస్త ఓర్పు, నేర్పు ఉంటే ఇలాంటి కోర్సులతో జీవితంలో స్థిరపడొచ్చు.
 - డాక్టర్ పి. హనుమంత రావు, చైర్మన్, స్వీకార్-ఉపకార్.

 డిమాండ్ పెరుగుతోంది
 స్పెషల్ కోర్సులకు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. కార్పొరేట్ రంగాలతోపాటు ప్రభుత్వ సంస్థల్లోనూ అవకాశాలు మెరుగవుతున్నాయి. సేవ చేస్తున్నామనే సంతృప్తితోపాటు ఉపాధి లభిస్తుండటం కూడా ఈ కోర్సుల పట్ల ఆసక్తికి కారణం. ముఖ్యంగా స్పీచ్, ఆడియాలజీలో నిపుణుల కొరత ఉంది. వినికిడి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఆంధ్ర మహిళా సభలో డీఎడ్ (హియర్ ఇంపైర్డ్, మెంటల్ రిటార్డ్) రెండేళ్ల కోర్సు. ఒక్కోదానిలో 25 సీట్లున్నాయి. గతంలో సీట్లు భర్తీ అయ్యేవి కాదు. నాలుగైదేళ్ల నుంచి సీట్లు మిగలట్లేదు.
 -పి. కృష్ణవేణి, ప్రిన్సిపల్,
 కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, ఆంధ్రమహిళాసభ.

 స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తోన్న  విద్యాసంస్థలు
 ఠాకూర్ హరిప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్,
 వివేకానందనగర్, దిల్‌సుఖ్‌నగర్.
 స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, సికింద్రాబాద్, వైఎస్సార్ కడప జిల్లా, గుంటూరు, తాండూరు.
 హెలెన్‌కిల్లర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిజాబుల్డ్ చిల్డ్రన్, సికింద్రాబాద్.
 డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్టణం.
 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి.
 కాలేజీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్రమహిళాసభ, ఓయూ క్యాంపస్.
 నవజీవన్ రెసిడెన్షియల్ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్, నంద్యాల, కర్నూలు జిల్లా.
 దుర్గాబాయి దేశ్‌ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, విద్యానగర్, హైదరాబాద్.
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్.
 సుగర్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -శ్రవణ్, విశాఖపట్నం.
 పలు రకాల బయోకెమికల్ విధానాల కలయికతో సుగర్ టెక్నాలజీ రూపొందుతుంది. పీజీ స్థాయిలో సుగర్ టెక్నాలజీ కోర్సులో సుగర్ కెమిస్ట్రీ, బాయిలింగ్, ఫెర్మిటేషన్, సుగర్ ప్రొడక్షన్‌కు సంబంధించిన టెక్నిక్‌లు ఉంటాయి. అంతేకాకుండా సుగర్ బాయిలింగ్, ఇండస్ట్రియల్ ఫెర్మిటేషన్, ఆల్కహాల్ టెక్నాలజీ, సుగర్ ఇన్‌స్ట్రుమెంటేషన్, తదితర అంశాల్లో స్వల్పకాలిక కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

 అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 నేషనల్ సుగర్ ఇన్‌స్టిట్యూట్-కాన్పూర్.
 కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సుగర్ టెక్నాలజీ
 అర్హత: బీఈ/బీటెక్ (కెమికల్ ఇంజనీరింగ్) లేదా బీఎస్సీ (ఎంపీసీ)
 కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సుగర్ ఇంజనీరింగ్
 అర్హత: బీఈ/ బీటెక్ (మెకానికల్/ ప్రొడక్షన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)/ తత్సమానం.
 కోర్సు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సుగర్ ఇంజనీరింగ్
 అర్హత: డిప్లొమా (మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)
 వివరాలకు: http://nsi.gov.in

 మన రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా స్థాయిలో కెమికల్ ఇంజనీరింగ్ (సుగర్ టెక్నాలజీ) కోర్సు అందుబాటులో ఉంది. పాలిసెట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. అర్హత: 10వ తరగతి. ఈ కోర్సు తర్వాత కెమికల్/పెట్రో కెమికల్/పెట్రోలియం బ్రాంచ్‌లతో బీటెక్ చేయొచ్చు.


 బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సు వివరాలను తెలపండి?
 -సరళ, కరీంనగర్.
 మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌ల కలయికతో రూపొందిన కోర్సు బయోఇన్ఫర్మాటిక్స్. వివరంగా చెప్పాలంటే.. స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అనువర్తనాలను మాలిక్యులర్ బయాలజీ విభాగంలోని పరిశోధనలు, ఆవిష్కరణల్లో ఉపయోగించే శాస్త్రం బయోఇన్ఫర్మాటిక్స్. ఇందులో సంబంధిత డేటా సేకరణ, నిర్వహణ, అధ్యయనం, విశ్లేషణ, తదితర అవసరాల కోసం కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ విధంగా సేకరించిన బయాలజికల్ డేటాను మానవ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉద్దేశించిన పరిశోధన కోసం వినియోగిస్తారు. బయోఇన్ఫర్మాటిక్స్‌కు సంబంధించి మన రాష్ట్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ స్థాయిలో మాత్రం బీఎస్సీ/బీటెక్ కోర్సుల్లోని బయోటెక్నాలజీ సబ్జెక్ట్‌లో ఒక భాగంగా బయోఇన్ఫర్మాటిక్స్‌ను అధ్యయనం చేయవచ్చు.
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఐఐఐటీ-హైదరాబాద్; వివరాలకు: www.iiit.ac.in
 సెంట్రల్ యూనివర్సిటీ-హైదరాబాద్
 వివరాలకు: www.uohyd.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
 వివరాలకు: www.andhrauniversity.edu.in
 ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఫర్ ఉమెన్-హైదరాబాద్
 వివరాలకు: www.oucwkoti.ac.in


 అడ్వర్‌టైజ్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులను వివరించండి?
 -రాజ వర్ధన్, నల్గొండ.
 ప్రజలలో తమ ఉత్పత్తుల ప్రచారానికి చక్కటి మార్గం అడ్వర్‌టైజ్‌మెంట్. సృజనాత్మకత, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ప్రజల అభిరుచి - ఆసక్తి సంబంధిత అంశాలపై అవగాహన, ప్రత్యేక టెక్నికల్ స్కిల్స్, చక్కని భావ వ్యక్తీకరణ ఉన్నవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు.

 అడ్వర్‌టైజ్‌మెంట్ రంగంలోని వివిధ విభాగాల్లో పుష్కలమైన ఉపాధి అవకాశాలున్నాయి. సంబంధిత అంశంలో షార్ట్ట్‌టర్మ్ కోర్సులు లేదా డిప్లొమా/ మల్టిమీడియా కోర్సులు చేయడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించొచ్చు. బ్యాచిలర్ స్థాయిలో జర్నలిజం, ఆర్ట్స్, మాస్ మీడియా సంబంధిత అంశాల్లో డిగ్రీ చేసిన వారు కూడా ఈ రంగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. అటు తర్వాత ప్రస్తుత ట్రెండ్‌కనుగుణంగా స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకుంటూ వెళితే స్వల్ప కాలంలోనే ఉన్నత స్థానాలకు చేరుకొనే అవకాశం ఉంటుంది.

 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ కమ్యూనికేషన్స్, బెంగళూరు- బీఎస్సీ(విజువల్ కమ్యూనికేషన్స్), డిప్లొమా ఇన్ డిజైన్ (అడ్వర్‌టైజింగ్ స్పెషలైజేషన్‌గా) కోర్సులను అందిస్తుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసినవారు ఈ కోర్సులకు అర్హులు. మాస్టర్ స్థాయిలో ఎంఎస్సీ (విజువల్ కమ్యూనికేషన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది.
 వెబ్‌సైట్: www.nicindia.org

 సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్-పుణే, ఎంబీఏ (మీడియా కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్, పీఆర్-బ్రాండ్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌గా) కోర్సును ఆఫర్ చేస్తుం ది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.simc.edu

 మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్, భోపాల్- ఎంఏ (అడ్వర్‌టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.
 వెబ్‌సైట్: www.mcu.ac.in

 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్- ముంబై, పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్‌టైజింగ్, మీడియా అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.
 వెబ్‌సైట్: www.niemindia.com
మెరైన్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను తెలపండి?
 -రఘునందన్, పాలకొల్లు.
 మెరైన్ ఇంజనీర్లు ప్రధానంగా ఓడలు, పెద్ద పెద్ద పడవల రూపకల్పనలో పాల్పంచుకుంటారు. వాటి ఇంజిన్, వివిధ భాగాల పనితీరును గమనించడం కూడా వీరి బాధ్యతే. ఓడ సమర్థంగా నడవడానికి కావల్సిన అన్ని రకాల వ్యవహారాలను మెరైన్ ఇంజనీర్లు పర్యవే క్షిస్తారు. మోడ్రన్ మెరైన్ టెక్నాలజీ, బేసిక్ టూల్స్, వర్క్‌షాప్ టెక్నాలజీ, పవర్ హౌసెస్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తదితర అంశాలను మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా బోధిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత పోర్ట్స్, షిప్పింగ్ పరిశ్రమలు, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వంటి సంస్థల్లో ఉపాధి పొందొచ్చు. అమెరికా, యూకేలలో కూడా వీరికి విరివిగా అవకాశాలుంటాయి.

 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం.
 ప్రవేశం: ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 మెరైన్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్-కోల్‌కతా.
 వెబ్‌సైట్: www.merical.ac.in
 టోలనీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్-పుణే
 వెబ్‌సైట్: www.tolani.edu
 వీఈఎల్‌ఎస్ యూనివర్సిటీ-చెన్నై
 వెబ్‌సైట్: www.velsuniv.org


 పీజీలో సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
     -అశోక్, ప్రొద్దుటూరు
 ఇంటర్నెట్, కంప్యూటర్ల వినియోగంలో అనుసంధానం చేసిన నెట్‌వర్క్‌కు సంబంధించిన లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడమే ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ టూల్స్, టెక్నిక్స్ ఉపయోగించి నెట్‌వర్క్, అప్లికేషన్స్, వెబ్‌సైట్స్ తదితరాల నెట్‌వర్క్‌కు చెందిన సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను సురక్షితంగా ఉంచేందుకు కావల్సిన వ్యూహాలను ఎథికల్ హ్యాకర్స్ రూపొందిస్తారు. కోర్సులో భాగంగా నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, ఆర్కిటెక్చర్, నెట్‌వర్కింగ్‌టూల్స్, టెక్నిక్స్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అంశాలను బోధిస్తారు. ఎథికల్ హ్యాకింగ్ కోర్సును పలు యూనివర్సిటీలు పీజీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు..
 ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- హైదరాబాద్
 కోర్సు: ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.iiit.ac.in
 జేఎన్‌టీయూ-హైదరాబాద్
 కోర్సు: ఎంటెక్ (కంప్యూటర్ నెట్‌వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.jntuh.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
 కోర్సు: ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్) వివరాలకు: www.andhrauniversity.edu.in
 ఈ యూనివర్సిటీలు గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తాయి.


 ఐఐఎస్సీ నుంచి పీహెచ్‌డీ చే యడం ఎలా?
     -ధరణి, సికింద్రాబాద్.
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తుంది. పీహెచ్‌డీ కోర్సుల్లో సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/ యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ జేఆర్‌ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జేఆర్‌ఎఫ్; జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా గేట్‌లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
 వివరాలకు: www.iisc.ernet.in


 యూపీఎస్సీ నిర్వహించే జియాలజిస్ట్ పరీక్ష వివరాలను తెలపండి? జియాలజీలో కోర్సులను ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
     -షాలినీ, కుప్పం.
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జియాలజిస్ట్‌ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. దీని ద్వారా జియాలజిస్ట్, హైడ్రో జియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హత: జియాలజిస్ట్: మాస్టర్స్ డిగ్రీ (జియలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజనీరింగ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/ ఎర్త్ సైన్స్ అండ్ రీసోర్సెస్ మేనేజ్‌మెంట్/ ఓషియనోగ్రఫీ అండ్ కోస్టల్ ఏరియాస్ స్టడీ/ పెట్రోలియం జియో సెన్సైస్/ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్/ జియో కెమిస్ట్రీ/ జియలాజికల్ టెక్నాలజీ/ జియో ఫిజికల్ టెక్నాలజీ) హైడ్రో జియాలజిస్ట్: మాస్టర్స్ డిగ్రీ (జియాలజీ/అప్లైడ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ) లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ైహైడ్రో జియాలజీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి.

 అవి.. జనరల్ ఇంగ్లిష్ (100 మార్కులు), జియాలజీ పేపర్-1 (200 మార్కులు), జియాలజీ పేపర్-2 (200 మార్కులు), జియాలజీ పేపర్-3(200 మార్కులు), హైడ్రోజియాలజీ (200 మార్కులు). ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది.

 వివరాలకు: www.upsc.gov.in
 మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు యూజీ, పీజీ స్థాయిల్లో జియాలజీ కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), పీహెచ్‌డీ (జియాలజీ) కోర్సును ఆఫర్ చేస్తుంది.

సుస్థిర భవితకు.. సమర్థ ప్రణాళిక

‘కెరీర్ ప్లానింగ్, ప్లాన్ యువర్ కెరీర్, కెరీర్ ప్లానింగ్ స్ట్రాటజీస్’.. నేటి పోటీ ప్రపంచంలో కార్పొరేట్ కంపెనీల్లో రాణించేందుకు అవసరమైన సాధనాలు. ప్రతి రంగంలో తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. సుస్థిర కెరీర్‌ను నిర్మించుకునేందుకు సాధ్యమైనంత ముందుగానే కెరీర్‌ను ప్లాన్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. కెరీర్ ప్లానింగ్ అంటే.. విద్యార్థి తన ఆసక్తులు, నైపుణ్యాలు, వ్యక్తిత్వం, విలువలు ఏంటో తెలుసుకుంటూ... తనకంటూ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. ఆ లక్ష్య సాధన కోసం.. నిరంతరం కృషి చేయడమే! సరైన కెరీర్ ప్లానింగ్ లేక ఎంతోమంది మంచి అవకాశాలను దూరం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. కెరీర్ ప్లానింగ్‌కు సంబంధించి నిపుణుల సలహాలు, సూచనలు!!

 కెరీర్ ప్లానింగ్ బాగుంటేనే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఇది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. మరి ఈ కెరీర్ ప్లానింగ్‌కు సరైన సమయం ఏది? నిపుణుల అభిప్రాయం ప్రకారం- మంచి భవిష్యత్తును ఆశించే విద్యార్థి కెరీర్ ప్లానింగ్‌కు సరైన సమయం.. పాఠశాల విద్యను పూర్తి చేసుకునే దశ. పాఠశాల స్థాయి దాటాక కాలేజీ దశ. ఈ కాలేజీ దశ ప్రారంభంలోనే కెరీర్ ప్లానింగ్ దిశగా అడుగులు వేయాలి. ఈ క్రమంలో.. విద్యార్థి తనను తాను ప్రశ్నించుకోవాలి. నా అభిరుచులు, ఆసక్తులు ఏంటి? నాకున్న నైపుణ్యాలు ఏమిటి? భవిష్యత్‌లో నేను ఏం కావాలనుకుంటున్నాను? నా ముందున్న అవకాశాలు (ఆప్షన్స్) ఏంటి? లక్ష్య సాధనకు నేను ఏం చేయాలి..? ఇవి కెరీర్ ప్లానింగ్‌లో ప్రాథమికంగా ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అంశాలు. ఆ తర్వాత తమ లక్ష్యానికి అనుగుణంగా కోర్సును ఎంచుకోవాలి.

 కోర్సును ఎంచుకున్నాక..:
 తన కెరీర్ లక్ష్యానికి అనుగుణంగా కోర్సును ఎంచుకున్నాక.. సదరు కోర్సులో చక్కటి నైపుణ్యాలను అందించే కాలేజీలను అన్వేషించాలి. కేవలం అకడమిక్‌పరమైన అభిరుచులే కాకుండా.. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ను కూడా కెరీర్ ప్లానింగ్ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. కార్పొరేట్ కాలేజీ వాతావరణంలో.. గంటల తరబడి తరగతి గదిలో మగ్గిపోయే విద్యార్థులు.. తమలోని ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్(స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్‌లో ఆసక్తి తదితరాలు)ని ప్రదర్శించే అవకాశం లేకపోవచ్చు.

 ఇది కొంతమందిలో భవిష్యత్తుపై ప్రతికూల దృక్పథాన్ని కలిగించే ఆస్కారముంది. ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. భవిష్యత్తు అంటే.. కేవలం ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులే అనే అభిప్రాయాన్ని వారు దూరం చేసుకోవాలి. తమ పిల్లల ఆసక్తి, అభిరుచులను తెలుసుకుని అందుకు తగిన కోర్సులు, భవిష్యత్తు అవకాశాలను, ప్రత్యామ్నాయాలను గుర్తించి తోడ్పాటునందించాలి. సరైన మార్గ నిర్దేశనం చేయాలి.


 ఉన్నత విద్యావకాశాలపై అవగాహన:
 మన విద్యా విధానంలో పాఠశాల తర్వాత దశ ఇంటర్మీడియెట్, లేదా సీబీఎస్‌ఈ +2. వీటిలో అందుబాటులో ఉండే గ్రూప్‌లు/సబ్జెక్టులు, తమకు నచ్చే కోర్సు విషయంలో విద్యార్థి ముందుగా ఒక స్పష్టమైన అవగాహనకు రావాలి. ఉదాహరణకు ఎంపీసీ గ్రూప్(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) నచ్చిన విద్యార్థి.. ఆ కోర్సు పూర్తిచేసిన తర్వాత లభించే ఉన్నత విద్యావకాశాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్, డెంటల్, ఫార్మసీ వంటి కోర్సులతోపాటు తాము ఇంటర్మీడియెట్‌లో చదివిన కోర్సుకు సరిపడే ఇతర బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఏంటో తెలుసుకోవాలి.

 ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీలో కూడా ఇంటర్మీడియెట్ గ్రూప్ సబ్జెక్ట్‌లకు అనుసంధానంగా ఉండే పలు అరుదైన కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. వాటి గురించి తెలుసుకుని.. ఆ తర్వాత పీజీ స్థాయిలో సంబంధిత స్పెషలైజేషన్లు, తద్వారా లభించే ఉద్యోగావకాశాల గురించి సమాచారం సేకరించాలి. వాస్తవానికి ఇంటర్మీడియెట్ స్థాయిలో విద్యార్థికి కెరీర్ ఎంపిక విషయంలో అవగాహన తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ దశలో తల్లిదండ్రులు, లెక్చరర్లు సహకారం అందించాలి. పూర్తిస్థాయి అవగాహనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించే మార్గనిర్దేశనాలు విద్యార్థికి కెరీర్ పరంగా ఎంతో ఉపయోగపడతాయి. ఉన్నత భవిష్యత్తుకు పునాది వేస్తాయి.

 కాలేజీ నుంచి జాబ్ దశకు:
 మూడు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ కోర్సు.. రెండేళ్ల పీజీ పూర్తిచేశాక.. విద్యార్థి ముందున్న ఏకైక లక్ష్యం.. మంచి ఉద్యోగం సంపాదించడం. అందుకోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, పోటీ పరీక్షలు, కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలకు రెజ్యూమె పంపించడం, రాత పరీక్షలకు హాజరవడం, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం.. ఇలా అన్ని మార్గాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం సాగించాలి. తాము బ్యాచిలర్, పీజీ స్థాయిల్లో చదివిన కోర్సు, సొంతం చేసుకున్న స్కిల్స్ ఆధారంగా సాగితే చక్కటి కెరీర్‌కు మార్గం సుగమం అవుతుంది.

 ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏదో ఒక ఉద్యోగం లభించడమే అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంతో.. తాము చదివిన కోర్సుతో సంబంధం లేకుండా దొరికిన ఉద్యోగంలో చేరుతున్నవారు కోకొల్లలు. ఇలాంటి విద్యార్థులు కొంతకాలం గడిచాక.. అందులో ఇమడలేక, తిరిగి తమకు ఆసక్తిగల రంగంలోకి ప్రవేశించలేక తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇది కెరీర్ పరంగా ఎంతో నష్టం కలిగించే అంశం. కాబట్టి ఈ విషయంలో ముందుగానే కసరత్తు చేయాలి. ప్రొఫెసర్లు, ఇతర సీనియర్ల సలహాలు తీసుకోవాలి. నాలుగేళ్లపాటు అకడమిక్‌గా ఒక విద్యార్థి నైపుణ్యాలను పరిశీలించే ప్రొఫెసర్లు కెరీర్ పరంగానూ చక్కటి మార్గ నిర్దేశకులే.


 కెరీర్ ప్లానింగ్ దశలు:
 వాస్తవానికి కెరీర్ ప్లానింగ్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఆసక్తులు, నైపుణ్యాలు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ.. పటిష్ట ప్రణాళిక రూపొందించుకుంటూ అమలు చేస్తుండాలి. కెరీర్ ప్లానింగ్‌లో ఎన్నో అంశాలు, దశలు ముడిపడి ఉంటాయి. అయితే, స్థూలంగా చూసినప్పుడు కెరీర్ ప్లానింగ్‌ను ఆరు దశలుగా పేర్కొనవచ్చు. అవి..

 మొదటి దశ: స్వీయ విశ్లేషణ..
 కెరీర్ ప్లానింగ్‌లో మొట్టమొదటి దశ స్వీయ విశ్లేషణ సాగించడం. ఈ విశ్లేషణలో పరిగణించాల్సిన అంశాలు.. సొంత నైపుణ్యాలు, సబ్జెక్ట్ పరిజ్ఞానం, వ్యక్తిగత ప్రవర్తన శైలి, మీకున్న విశ్వాసం స్థాయి, వ్యక్తిగత పరిమితులు, ఆసక్తులు, వాస్తవాలు, బాధ్యతలు.

 రెండో దశ: సెల్ఫ్ డెవలప్‌మెంట్..
 మొదటి దశలో స్వీయ విశ్లేషణ పకడ్బందీగా పూర్తిచేసి తమ గురించి తాము ఒక అవగాహనకు వచ్చాక.. వ్యక్తిగత లోటుపాట్లు, బలాలు-బలహీనతలపై స్పష్టత ఏర్పడుతుంది. వీటిద్వారా సెల్ఫ్ డెవలప్‌మెంట్‌కు మార్గం వేసుకునే దశ ఇది. తమకున్న నైపుణ్యాలు, ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు గుర్తించాలి. ఉదాహరణకు ఒక విద్యార్థికి సాఫ్ట్‌వేర్ రంగంలో వస్తున్న సరికొత్త టెక్నాలజీల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండొచ్చు. ఇలాంటి వాటిని మెరుగుపరచుకోవడం కోసం ఈ సెల్ఫ్ డెవలప్‌మెంట్ దశ ఉపయోగపడుతుంది.

 మూడో దశ: పరిశోధన..
 కెరీర్ ప్లానింగ్ పరంగా ఈ దశ కొంత కీలకం. ఇప్పటికే మొదటి రెండు దశల ద్వారా ఆసక్తులు, ఆలోచనలపై అవగాహనకు వచ్చి ఉంటారు. అయితే, వాటిలో ఏవి ఉన్నత కెరీర్‌కు ఉపయోగపడతాయో పరిశోధించాలి. తద్వారా తమ ఆసక్తులకు అనుగుణమైన వృత్తులను, కంపెనీలను గుర్తించాలి. సదరు కంపెనీలో తమ ఆసక్తులకు అనుగుణంగా పనిచేయగల వాతావరణం ఉందో, లేదో గుర్తించాలి. ఆ కంపెనీ లేదా రంగం భవిష్యత్తును అంచనా వేయాలి.

 నాలుగో దశ: కార్యాచరణ ప్రణాళిక
 మూడో దశలో చేసిన పరిశోధన, పరిశీలన ఫలితంగా నచ్చిన రంగాన్ని, పరిశ్రమను గుర్తించిన తర్వాత.. ఆ రంగంలో కెరీర్‌ను అన్వేషించడానికి కార్యాచరణకు ఉపక్రమించాల్సిన దశ ఇది. ఈ క్రమంలో ముందుగా చిన్నపాటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. అవే భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు అధిగమించేందుకు ఉపయోగపడతాయి. ఇదే క్రమంలో గుర్తుంచుకోవాల్సిన అంశం.. ఈ కార్యాచరణ భారీగా ఉండకుండా.. వాస్తవ పరిస్థితులకు, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఉండేలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ క్రమంలో.. ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. దీన్ని కెరీర్‌కు పునాదిగా భావించాలి. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ముందుగా మీకు అభిరుచి ఉన్న అంశానికి సంబంధించి చిన్నపాటి ఇంటర్న్‌షిప్ లేదా పార్ట్‌టైం జాబ్ సంపాదించాలి.


 అయిదో దశ: లక్ష్యాల రూపకల్పన
 ఇప్పటికే మొదటి నాలుగు దశల ఆధారంగా మీరు అన్వేషించిన ఉద్యోగాలు, అవకాశాలను సమీక్షించుకోవాలి. ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? అని పరిశీలించాలి. దీనిద్వారా స్వల్ప కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఇలా.. స్వీయ విశ్లేషణ ద్వారా ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలను గుర్తించి, ఆ దిశగా కృషి చేయాలి.

 ఆరో దశ: కార్యక్షేత్రంలో ప్రవేశం
 పకడ్బందీ కెరీర్ ప్లానింగ్ క్రమంలో దీన్ని చివరి దశగా పేర్కొ నవచ్చు. ఇప్పటికే మీరు ఏర్పరచుకున్న లక్ష్యాల దిశగా.. కార్యక్షేత్రంలో ప్రవేశించడానికి ఉపక్రమించాల్సిన దశ ఇది. ప్రవేశించాక కూడా సంబంధిత విభాగంలో నిరంతరం లక్ష్యాలు ఏర్పరచుకుని వాటి ప్రగతిని సమీక్షించుకోవాలి.
 ఇలా పాఠశాల దశ నుంచే పకడ్బందీ ప్లానింగ్‌తో అడుగులు వేస్తే.. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అభిరుచులు, ఆసక్తి, సరితూగే కోర్సులను పరిగణనలోకి తీసుకుంటూ.. దీర్ఘకాలిక ప్రణాళికతో , ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

 ప్రధానం.. అభిరుచే
 ప్రస్తుతం విద్యార్థులకు పదో తరగతి నుంచే పలు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అభిరుచే ఆధారంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకుసాగొచ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్ ప్లానింగ్ అనేది ఎంతో ముఖ్యమైన అంశంగా మారింది. ఈ కెరీర్ ప్లానింగ్‌కు రూపకల్పన చేసుకునే ప్రక్రియలో భాగంగా అవసరమైతే సైకాలజిస్ట్‌లు, కెరీర్ కౌన్సెలర్లను సంప్రదించడానికి కూడా సందేహించకూడదు. చివరికి ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకున్న తర్వాత అకడమిక్‌గా, కెరీర్ పరంగా ఆ రంగంలో గల అవకాశాలను, వ్యక్తిగత అంశాలను బేరీజు వేసుకుంటూ.. కెరీర్ ప్రణాళిక రూపొందించుకుంటే నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సులభం.
 - ఎం.రామకృష్ణ, మేనేజింగ్ డెరైక్టర్,
 జడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్

విద్యార్థుల భావి జీవితానికి ‘నవోదయ'

గ్రామీణ విద్యార్థులకు కూడా మెరుగైన విద్యనందించి, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. మన దేశంలో మొత్తం 595 జవహర్ నవోదయ విద్యాలయాలున్నాయి. మన రాష్ర్టంలో ఉన్న 24 నవోదయా పాఠశాలల్లో 1920 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో విజయం సాధించి ప్రవేశం పొందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు విద్య, వసతి, భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేన్‌వీఎస్‌టీ)-2014 పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్‌పై ఫోకస్...

 జాతీయ విద్యా విధానం(1986) ప్రకారం గ్రామీణ ప్రాంత విద్యార్థులను సైతం పట్టణ ప్రాంత విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. నేడు తల్లిదండ్రులకు విద్య పెను భారంగా మారింది. నర్సరీలు, ప్లేస్కూల్స్‌లో ఫీజులు వేలల్లోనే. ఇంటర్నేషనల్ స్కూల్స్‌ల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయాలు విద్యార్థులకు వరమని చెప్పొచ్చు. వీటిల్లో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల విధానంలో బాలబాలికలకు విద్యనందిస్తారు. ఈ నవోదయ విద్యాలయాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా స్వత ంత్ర ప్రతిపత్తి కలిగిన జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఉంది. జిల్లాకు ఒకటి చొప్పున, కొన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా మరికొన్ని నవోదయ విద్యాలయాలున్నాయి.

 ప్రవేశం ఇలా:
 నవోదయ విద్యాలయాల్లో మొదట ఆరో తరగతిలోకి మాత్రమే ప్రవేశం లభిస్తోంది. అది కూడా ఒక్కో విద్యాలయానికి 80 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు 12వ తరగతి వరకు విద్యనభ్యసించొచ్చు. ఎనిమిదో తరగతి వరకు విద్యార్థి మాతృభాషలో బోధన చేస్తారు. పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకే షన్ (సీబీఎస్‌ఈ) సిలబస్‌తో రాయాలి.

 అర్హత:
 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. ఏ జిల్లాలో నవోదయ స్కూల్ ఉందో.. ఆ జిల్లాకు మాత్రమే అర్హులవుతారు.
 మే 1, 2001 కంటే ముందు, ఏప్రిల్ 30, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు.

 సీట్లు:
 ప్రతి జిల్లాలో కనీసం 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు.
 గ్రామీణ కోటాలో, అర్బన్ కోటాలో సీట్లు పొందాలంటే సంబంధిన ప్రాంతంలో ఉన్న పాఠశాలలో మూడు, నాలుగు, ఐదు తరగతులు చదివుండాలి.
 రిజర్వేషన్స్: ప్రతి నవోదయ పాఠశాలలో మొత్తం సీట్లలో 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయిస్తారు. 1/3 వంతు సీట్లు బాలికలకు ఉంటాయి. మూడు శాతం సీట్లను శారీరక వికలాంగులతో భర్తీ చేస్తారు.

 పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధి ఉండే పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థి ఏ మీడియంలో ఐదో తరగతి చదువుతున్నాడో అదే మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది.

 విభాగం    ప్రశ్నలు    మార్కులు    సమయం
 మెంటల్ ఎబిలిటీ టెస్ట్    50    50    60 ని.
 అర్థమెటిక్ టెస్ట్     25    25    30 ని.
 లాంగ్వేజ్ టెస్ట్     25    25    30 ని.
 మొత్తం    100    100    2 గం.

 దరఖాస్తు ఇలా: దరఖాస్తుతోపాటు ప్రాస్పెక్టస్‌ను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్,జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ నుంచి పొందొచ్చు. లేదా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2013
 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 8, 2014
 వివరాలకు: www.navodaya.nic.in


 అన్నీ ఉచితమే
 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వైద్య సదుపాయాలు కూడా ఉచితంగా అందిస్తారు. కో ఎడ్యుకేషన్ విధానంలో, పూర్తిగా గురుకుల పద్ధతిలో బోధన ఉంటుంది. బాలబాలికలకు వేరు వేరుగా హాస్టల్ వసతి ఉంటుంది. ఇక్కడి నవోదయా లో మొత్తం 45 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. 12వ తరగతి వరకు ఉచితంగా విద్య అభ్యసించవచ్చు.

గ్రామీణాభివృద్ధి కోర్సులు.. అవకాశాలు ఘనం!!

గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో ప్రపంచం పరుగులు తీస్తున్న తరుణం.. బహుళ జాతి సంస్థలు అన్ని దేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తున్న సమయం.. విద్యార్థులు లక్షల్లో వేతనాలు అందించే కోర్సులవైపు దృష్టిసారిస్తున్న సందర్భం.. అయితే విద్యార్థులు కొంత దూరదృష్టితో ఆలోచిస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభం చేకూర్చే కోర్సులు.. గ్రామీణాభివృద్ధి కోర్సులు అంటున్నారు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెల్ ప్రాజెక్ట్ డెరైక్టర్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ హెడ్ డాక్టర్ ఎస్.ఎం.ఇలియాస్. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి దిశగా కృషిచేస్తున్న ప్రస్తుత తరుణంలో.. గ్రామీణాభివృద్ధి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు గోల్డెన్ కెరీర్ ఖాయం అంటున్న ఇలియాస్‌తో  ప్రత్యేక ఇంటర్వ్యూ..


 గ్రామీణాభివృద్ధి తప్పనిసరి
 వందకోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశంలో.. అత్యధిక శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలే. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో ఎన్ని బహుళ జాతి సంస్థలు అడుగుపెట్టినా.. దేశం ప్రగతి పథంలో సాగాలంటే ముందుగా గ్రామీణాభివృద్ధి జరగాలి. గ్రామీణప్రాంత ప్రజలు ఈ ప్రపంచీకరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. పల్లె ప్రజలకు ప్రస్తుత పరిస్థితులపై అవగాహన, అందుకు తగినవిధంగా స్వయం సాధికారత సాధించే ఆత్మవిశ్వాసం నెలకొల్పాలి. ఇది సాధ్యం కావాలంటే.. సరైన మార్గనిర్దేశనం అవసరం. అలా మార్గనిర్దేశనం చేసే కోర్సులే.. గ్రామీణాభివృద్ధి కోర్సులు. ఆ దిశగా.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కోర్సులకు రూపకల్పన చేసింది.


 ప్రస్తుతం మూడు కోర్సులు
 ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి రెసిడెన్షియల్ విధానంలో పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) కోర్సు, దూర విద్యా విధానంలో పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాం. ప్రతి కోర్సు కాల వ్యవధి  సంవత్సరం. రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు కోర్సు పూర్తయ్యేవరకూ తప్పనిసరిగా ఎన్‌ఐఆర్‌డీ క్యాంపస్‌లోని హాస్టల్‌లోనే నివసించాలి. ఇప్పటికే ఆయా ఉద్యోగాలు చేస్తూ.. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కోర్సులపై ఆసక్తి ఉన్నవారికి కలిసొచ్చే కోర్సులు.. దూర విద్యా విధానంలో అందిస్తున్న రెండు కోర్సులు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పరిధిలోని పలు గ్రామీణాభివృద్ధి పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉన్నతికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.


 వినూత్నంగా పీజీడీఆర్‌డీఎం
 ఎన్‌ఐఆర్‌డీ రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సు. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత ఏదైనా విభాగంలో డిగ్రీ. బోధన, కరిక్యులం పూర్తి వినూత్నంగా ఉంటుంది. ఈ కోర్సు కాల వ్యవధి ఏడాది. బ్యాచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటారు. విద్యార్థులను నేరుగా క్లాస్‌రూంలో కూర్చోపెట్టకుండా.. ముందుగా అయిదు రోజులు ఫీల్డ్ విజిట్ పేరిట నిర్దిష్ట గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తాం. అయిదు రోజుల తర్వాత విద్యార్థులు ఫీల్డ్ విజిట్‌లో తాము తెలుసుకున్న సమస్యలు, ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచే క్లాస్ రూం బోధన మొదలవుతుంది. అదేవిధంగా ఏడాది వ్యవధిగల కోర్సులో 45రోజులపాటు ఫీల్డ్ విజిట్ పేరుతో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రాజెక్ట్‌వర్క్ కూడా తప్పనిసరి. ఇలాంటి బోధన ఫలితంగా కోర్సు పూర్తిచేసుకునే సమయానికి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణత లభిస్తుంది.


 ఎన్‌ఐఆర్‌డీలో ప్రవేశం పొందాలంటే
 ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి స్థాయిలో అందిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంకు ప్రతి ఏటా డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తర్వాత రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా విడుదల చేస్తాం. ఇక.. దూర విద్యా విధానంలో అందించే రెండు కోర్సుల్లో ఒకటైన పీజీ డిప్లొమా ఇన్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తాం. మరో కోర్సు పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు ఎన్‌ఐఆర్‌డీనే నేరుగా ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తుంది. సాధారణంగా వీటికి నోటిఫికేషన్ అక్టోబర్ లేదా నవంబర్‌లో వెలువడుతుంది.


 ఎంఎన్‌సీలకు దీటుగా ప్లేస్‌మెంట్స్
 కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు క్యాంపస్‌లోని ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. వీటిలో విద్యార్థులకు అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో..  పలు కార్పొరేట్ సంస్థలు కూడా ఈ కోర్సు విద్యార్థులను నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలో 2012-13 వరకు ఈ కోర్సు సర్టిఫికెట్లు అందుకున్న అయిదు బ్యాచ్‌ల 250 మంది విద్యార్థుల్లో.. ప్రతి ఒక్కరికి ప్లేస్‌మెంట్స్ లభించాయి. ప్రారంభంలో కనీసం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనాలు అందుకున్న విద్యార్థులు కూడా ఉన్నారంటేనే ఈ కోర్సుకున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.


 ఆదరణకు కొదవ లేదు
 పీజీడీఆర్‌డీఎం కోర్సు విషయంలో విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. బీటెక్, ఎంబీఏ, లా తదితర ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తిచేసుకుని పలు ఎంఎన్‌సీల్లో ఉద్యోగాలు వదిలేసి.. ఈ కోర్సులో చేరిన విద్యార్థులుండటమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా కేవలం 50 మందికి మాత్రమే ప్రవేశం కల్పించే ఈ కోర్సులో చేరడానికి వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అయితే  గ్రామీణాభివృద్ధి, సంబంధిత రంగంలో అకడెమిక్ కోణంలో ఆలోచించే విద్యార్థులకు సోషియాలజీ, సోషల్‌వర్క్, ఆంత్రోపాలజీలే వేదికలుగా మారాయి. వాస్తవానికి అవి కూడా రూరల్ డెవలప్‌మెంట్ సంబంధితమైనప్పటికీ వాటిలో పూర్తిస్థాయిలో అవగాహన లభించడం సాధ్యం కాదు. కాబట్టి రూరల్ డెవలప్‌మెంట్ కోర్సుల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు పూర్తిస్థాయిలో ఈ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలుసుకుని వాటిలో ప్రవేశించడం మంచిది.


 యూనివర్సిటీలు కూడా చొరవ చూపాలి
 గ్రామీణాభివృద్ధి కోర్సుల రూపకల్పనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలు, ఇతర గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు కూడా చొరవ చూపాలి. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి దిశగా ఇటీవల  ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ కోర్సుల రూపకల్పన చేస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ దిశగా యూనివర్సిటీలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే శ్రీకాకుళంలోని డాక్టర్‌॥బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ.. ఎన్‌ఐఆర్‌డీ కొలాబరేషన్‌తో కోర్సును ప్రారంభించేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభించింది. అదే విధంగా ఒడిశాలోని బరంపూర్ యూనివర్సిటీ కూడా సంప్రదించింది. ఇదే తరహాలో ఇతర యూనివర్సిటీలు కూడా అడుగులు వేస్తే బాగుంటుంది. ఎన్‌ఐఆర్‌డీ అనేది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ. అన్ని ప్రాంతాల్లో క్యాంపస్‌లు, కోర్సులు రూపకల్పన చేయడం క్లిష్టమైన ప్రక్రియ. అయితే పరస్పర సహకారంతో కోర్సులు అందిస్తామనే ఇన్‌స్టిట్యూట్‌లకు మేం తప్పక సహకరిస్తాం.


 మరో విశిష్టత.. ఎన్‌ఐటీ ఇటానగర్‌లో ఎంటెక్
 అకడెమిక్ పరంగా ఎన్‌ఐఆర్‌డీ చేపట్టిన మరో ముఖ్య కార్యక్రమం.. ఎన్‌ఐటీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)-ఇటానగర్(అరుణాచల్ ప్రదేశ్)తో ఒప్పం దం కుదుర్చుకుని ఎంటెక్(అప్రాప్రియేట్ టెక్నాలజీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాక్టీసెస్) కోర్సును రూపొందించాం. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సు మొదలైంది. టెక్నాలజీని రూరల్ డెవలప్‌మెంట్‌తో అనుసంధానం చేస్తూ ఇలాం టి కోర్సును ప్రారంభించడం దేశంలోనే తొలిసారి. ఇలా ఎన్‌ఐఆర్‌డీ వీలైనంత మేర అన్ని విభాగాల్లో రూరల్ డెవలప్‌మెంట్‌ను అకడెమిక్ స్థాయిలోనే విస్తృతం చేసి తద్వారా భవిష్యత్తులో దేశ ప్రగతికి చేయూతనందించేందుకు కృషి చేస్తోంది.


 షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సుల దిశగా ఆలోచన
 ఎన్‌ఐఆర్‌డీ దీర్ఘకాలిక కోర్సులతోపాటు స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించే దిశగానూ ఆలోచిస్తోంది. ముందుగా మూడు నెలల వ్యవధిలో పావర్టీ ఎరాడికేషన్ మేనేజ్‌మెంట్, జీఐఎస్-ఐసీటీ అప్లికేషన్ కోర్సుల ప్రారంభానికి చర్చలు జరుగుతున్నాయి.


 ఉన్నత విద్యావకాశాలు
 ఎన్‌ఐఆర్‌డీ అందిస్తున్న కోర్సులన్నీ పీజీ డిప్లొమా కోర్సులే. కాబట్టి ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేయడమే మార్గం. ఇక్కడ పేర్కొన్నట్లుగానే ఎన్‌ఐఆర్‌డీలో కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించి.. దూర విద్యా విధానంలో ఎంఏ, ఎం.ఫిల్ కోర్సులు అభ్యసిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.


 భవిష్యత్తులో లక్షల్లో అవకాశాలు
 రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తు బంగారుమయం అనడంలో సందేహం లేదు. కేవలం ప్రభుత్వ రంగంలోనే లక్షల్లో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో 15.75 లక్షల స్వయం సహాయక బృందాలను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒక్క అంశాన్నే పరిగణనలోకి తీసుకుంటే అంతమందికి తగిన మార్గ నిర్దేశనం చేయడానికి రూరల్ డెవలప్‌మెంట్‌లో సుశిక్షితులైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమ అమలుకు, సోషల్ అడిట్ నిర్వహణ తదితర అంశాలకు కూడా రూరల్ డెవలప్‌మెంట్ ఉత్తీర్ణులే సరితూగుతారు. ఇక ప్రైవేట్ రంగంలో ఇటీవలే ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తప్పనిసరి చేసింది. దీంతో అన్ని కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి. ఇందుకు కూడా సుశిక్షితులైన రూరల్ డెవలప్‌మెంట్ అభ్యర్థులే సరితూగుతారు.


 ఔత్సాహిక విద్యార్థులకు సలహా
 మిగతా కోర్సులతో పోల్చితే రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు వైవిధ్యభరితం. దీనికనుగుణంగా ఔత్సాహిక విద్యార్థులకు స్వయంగా కొన్ని లక్షణాలు ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి సంస్కృతి, నేపథ్యం ఉన్న ప్రజలతోనైనా మమేకమవగల మనస్తత్వం, నిజమైన ఆసక్తి, గ్రామీణ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటేనే ఇందులో రాణించగలరు. కేవలం పైన పేర్కొన్న ప్లేస్‌మెంట్ రికార్డ్స్, వేతనాలు ఆధారంగా అడుగుపెడితే యాంత్రికంగా ఉంటుంది. భవిష్యత్తులో రాణించడం కష్టం. కాబట్టి ఈ కోర్సులు సహనం, ఓర్పు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్న వారికి ఎంతో అనుకూలం.


 రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్- ఐఆర్‌ఎం క్యాంపస్ (జైపూర్)
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్- ఆనంద్ (గుజరాత్)
 యూనివర్సిటీ ఆఫ్ కల్యాణి- పశ్చిమబెంగాల్
 జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూరల్ మేనేజ్‌మెంట్- భువనేశ్వర్, జార్ఖండ్
 రామకృష్ణ మిషన్ విద్యాలయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
 అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్- తమిళనాడు
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- గుంటూరు
 భారతీ విద్యాపీఠ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్- మహారాష్ట్ర

వ్యవసాయ వర్సిటీల్లో అధ్యాపక వృత్తికి ఏఎస్‌ఆర్‌బీ నెట్

ఇన్ఫోకార్నర్

 యూజీసీ-నెట్, స్లెట్ (స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్) తరహాలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిని ప్రారంభించాలనుకునే అభ్యర్థుల కోసం అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) విభాగం ఏఎస్‌ఆర్‌బీ-నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను నిర్వహిస్తుంది. 2013 సంవత్సరానికి ఏఎస్‌ఆర్‌బీ-నెట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. వ్యవసాయ, దాని అనుబంధ విభాగాల్లో కలిపి మొత్తం 55 విభాగాల్లో ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌ను నిర్వహిస్తారు.

 పరీక్షా విధానం:
 రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా మాస్టర్ డిగ్రీ స్థాయిలో ప్రశ్నలను అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.

 ఐదు అవకాశాలు:
 ప్రతి అభ్యర్థికి ఏఎస్‌ఆర్‌బీ-నెట్ రాసేందుకు ఐదు అవకాశాలు (2012 ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌కు ముందు హాజరైన సందర్భాలను మినహాయించి) ఉంటాయి . నిర్దేశిత అభ్యర్థులకు నెట్ హాజరు విషయంలో పరిమితి లేదు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 33 కేంద్రాల్లో ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌ను నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం ఉంది.

 అర్హత మార్కులు:
 నెట్/స్లెట్ మాదిరిగానే ఇందులో కూడా నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే ఫైనల్ రిజల్ట్స్ ప్రిపరేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో జనరల్/ఓబీసీ (క్రీమీలేయర్) అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీసీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి.

 ప్రయోజనాలు:
 రాష్ట్ర లేదా జాతీయస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ఏఎస్‌ఆర్‌బీ- నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌లో క్వాలిఫైయిడ్ అభ్యర్థులకు ఏఎస్‌ఆర్‌బీ సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తుంది. తద్వారా అగ్రికల్చర్ యూనివర్సిటీలలోని అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం సద రు అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది.

 నోటిఫికేషన్ సమాచారం:
 అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో ఆగస్ట్ 1, 2013 నాటికి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
 వయసు: 21 ఏళ్లు (ఆగస్ట్ 1, 2013 నాటికి). గరిష్ట వయోపరిమితి లేదు.
 ఫీజు:జనరల్ అభ్యర్థులు రూ. 1,000
 ఓబీసీ (నాన్-క్రీమీలేయర్) రూ. 500
 ఎస్సీ/ఎస్టీ/పీసీ     రూ. 250
 ఫీజును నిర్దేశించిన విధంగా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

 దరఖాస్తు విధానం:
 www.asrb.org.in/ www.icar.org.in/
 www.asrbexamonline.com/asrbreg/default.aspx వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తుల స్వీకర ణకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2013.
 రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 27, 2013.
 వెబ్‌సైట్: www.asrb.org.in / www.icar.org.in

యోగా కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు.

బీటెక్ (ఈఈఈ) తర్వాత ఎటువంటి అవకాశాలు ఉంటాయి?
 -రమేశ్, విజయనగరం.
 బీటెక్ (ఈఈఈ) తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షకు హాజరు కావచ్చు. తద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు సహా ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా.. ఎంఈ/ ఎంటెక్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. పలు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఎంట్రీలెవల్ రిక్రూట్‌మెంట్ కోసం కూడా గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

 బార్క్, భారత అణుశక్తి శాఖలోని కొన్ని విభాగాలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లు.. గేట్ స్కోర్ ఆధారంగానే ఎంట్రీ లెవల్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో పీజీఈసెట్ ద్వారా ఎంటెక్/ఎంఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. మరో అవకాశం యూపీఎస్సీ జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఈఎస్). ఈ పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-ఏ, బీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు.
 వివరాలకు: www.upsc.gov.in

 స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి?    -సునీల, కర్నూలు.
 మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ కోర్సులో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్, విజువల్, ఆటిజం, ఇంపెయిర్‌మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 ఈ కోర్సులను పూర్తి చేస్తే దేశ, విదేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా; రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీ స్కూళ్లు, వివిధ పాఠశాలల్లో ప్రత్యేక విద్యార్థులకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. మన రాష్ట్రంలో.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్ (వెబ్‌సైట్: www.nimhindia.org); స్వీకార్ రిహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్ -సికింద్రాబాద్ (వెబ్‌సైట్: www.sweekaar.org); ఆంధ్రా వర్సిటీ-విశాఖపట్నం (వెబ్‌సైట్: www.andhrauniversity. edu.in); శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం-తిరుపతి (www.spmvv.ac.in); కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-ఆంధ్ర మహిళా సభ-హైదరాబాద్ (www.andhramahilasabha. org.in)లు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తున్నాయి.

 యోగాకు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -సనత్ కుమార్, రావులపాలెం.
 భారతీయ సంస్కృతిలో యోగా ఒక భాగం. శారీరక, మానసిక ఆరోగ్యాలకు యోగాభ్యాసాన్ని మించిన వైద్యం లేదన్న విషయం ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో యోగా ప్రాక్టీస్ చేసేవారు పెరిగారు. ఇది ఒక కెరీర్‌గా మారింది. దీంతో యోగా ట్రైనర్లకు డిమాండ్ ఏర్పడింది. వృత్తి పట్ల నిబద్ధత, సహనం, ఆరోగ్యం కోసం వచ్చే వారి పట్ల వ్యవహరించే తీరుపైనే కెరీర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక మాదిరి పట్టణాలు, పెద్ద నగరాల్లో యోగా ట్రైనింగ్ సెంటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటువంటి ప్రదేశాల్లో ప్రారంభంలో ట్రైనర్లు నెలకు రూ.20,000 నుంచి రూ. 25,000 వరకు ఆదాయం పొందుతున్నారు. మిడిల్ లెవెల్ ప్రొఫెషనల్స్ నెలకు రూ.40 వేల నుంచి రూ. 50 వేలు, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం లక్ష రూపాయలు ఆర్జిస్తున్నారు.

 యోగా కోర్సులను అందిస్తున్న సంస్థలు:
 శ్వాస (SVYASA) యూనివర్సిటీ-బెంగళూరు. ఈ యూనివర్సిటీ యోగాకు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులతోపాటు డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులను కూడా అందిస్తుంది
 వివరాలకు: www.svyasa.org
 మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా- న్యూఢిల్లీ.
 వివరాలకు: www.yogamdniy.nic.in
 యోగా లైఫ్- న్యూఢిల్లీ.
 వివరాలకు: www.yogalife.org
 శివానంద యోగ వేదాంత సెంటర్స్.
 వివరాలకు: www.sivananda.org
 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి- న్యూఢిల్లీ.
 వివరాలకు: www.ccryn.org




 ఆక్యుపేషనల్ థెరపి కోర్సు వివరాలను తెలపండి?  
 -పద్మావతి, అనంతపురం.
 మానసిక లేదా శారీరక వైకల్యాలతో బాధపడే వారు తమ దైనందిక కార్యకలాపాలను ఎవరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా నిర్వహించుకునేలా దోహదం చేసేది ఆక్యుపేషనల్ థెరపి. ఇందుకోసం చుట్టూ ఉన్న వాతావరణం, శక్తి సామర్థ్యాలు, తదితర అంశాలను ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు పరిగణనలోకి తీసుకుంటారు.

 ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-తమిళనాడు
 వివరాలకు: www.srmuniv.ac.in
 మణిపాల్ యూనివర్సిటీ-కర్ణాటక
 వివరాలకు: www.manipal.edu
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్-ఒడిశా
 వివరాలకు: http://nirtar.nic.in

వ్యవసాయ వర్సిటీల్లో అధ్యాపక వృత్తికి ఏఎస్‌ఆర్‌బీ నెట్

ఇన్ఫోకార్నర్

 యూజీసీ-నెట్, స్లెట్ (స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్) తరహాలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిని ప్రారంభించాలనుకునే అభ్యర్థుల కోసం అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) విభాగం ఏఎస్‌ఆర్‌బీ-నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను నిర్వహిస్తుంది. 2013 సంవత్సరానికి ఏఎస్‌ఆర్‌బీ-నెట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. వ్యవసాయ, దాని అనుబంధ విభాగాల్లో కలిపి మొత్తం 55 విభాగాల్లో ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌ను నిర్వహిస్తారు.

 పరీక్షా విధానం:
 రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా మాస్టర్ డిగ్రీ స్థాయిలో ప్రశ్నలను అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.

 ఐదు అవకాశాలు:
 ప్రతి అభ్యర్థికి ఏఎస్‌ఆర్‌బీ-నెట్ రాసేందుకు ఐదు అవకాశాలు (2012 ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌కు ముందు హాజరైన సందర్భాలను మినహాయించి) ఉంటాయి . నిర్దేశిత అభ్యర్థులకు నెట్ హాజరు విషయంలో పరిమితి లేదు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 33 కేంద్రాల్లో ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌ను నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం ఉంది.

 అర్హత మార్కులు:
 నెట్/స్లెట్ మాదిరిగానే ఇందులో కూడా నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే ఫైనల్ రిజల్ట్స్ ప్రిపరేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో జనరల్/ఓబీసీ (క్రీమీలేయర్) అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీసీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి.

 ప్రయోజనాలు:
 రాష్ట్ర లేదా జాతీయస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ఏఎస్‌ఆర్‌బీ- నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌లో క్వాలిఫైయిడ్ అభ్యర్థులకు ఏఎస్‌ఆర్‌బీ సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తుంది. తద్వారా అగ్రికల్చర్ యూనివర్సిటీలలోని అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం సద రు అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది.

 నోటిఫికేషన్ సమాచారం:
 అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో ఆగస్ట్ 1, 2013 నాటికి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
 వయసు: 21 ఏళ్లు (ఆగస్ట్ 1, 2013 నాటికి). గరిష్ట వయోపరిమితి లేదు.
 ఫీజు:జనరల్ అభ్యర్థులు రూ. 1,000
 ఓబీసీ (నాన్-క్రీమీలేయర్) రూ. 500
 ఎస్సీ/ఎస్టీ/పీసీ     రూ. 250
 ఫీజును నిర్దేశించిన విధంగా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

 దరఖాస్తు విధానం:
 www.asrb.org.in/ www.icar.org.in/
 www.asrbexamonline.com/asrbreg/default.aspx వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తుల స్వీకర ణకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2013.
 రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 27, 2013.
 వెబ్‌సైట్: www.asrb.org.in / www.icar.org.in

ఉజ్వల కెరీర్‌కు సరైన సోపానం.. సీఏ

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)లో ఉత్తీర్ణత అంత తేలిక కాకపోవచ్చు.. ఓ పట్టాన కొరుకుడుపడని సబ్జెక్టులూ ఉండొచ్చు.. అయితే ఇష్టపడి ఆపై కష్టపడితే సీఏలో అత్యుత్తమ స్కోర్‌తో ఉజ్వల కెరీర్ కూడా సొంతమవుతుంది. మంచి హోదా, ఆకర్షణీయ ఆదాయాన్ని అందించే సీఏలో తొలిదశ సీపీటీ పరీక్షకు నోటిఫికేషన్
 వెలువడిన నేపథ్యంలో స్పెషల్ ఫోకస్..


 ప్రస్తుతం దేశంలో అన్ని రకాల పరిశ్రమలు చార్టర్డ్ అకౌంటెంట్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిశ్రమల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే కనీసం ఐదు లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ తదితర రంగాలు సీఏలకు మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. సీఏలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు ప్రవేశ అర్హతలు, ఇతర అంశాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) చాలా మార్పులు చేసింది.

 21 ఏళ్లు నిండేసరికి పూర్తిచేయొచ్చు:
 సీఏ అనగానే కొరుకుడుపడని కోర్సు అనే అభిప్రాయముం ది. కానీ, ఇష్టపడి చదివితే సీఏ పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. పట్టుదలతో ప్రణాళిక ప్రకారం కృషిచేస్తే 21 ఏళ్లు నిండేసరికి కోర్సు పూర్తిచేసి సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పోలిస్తే సీఏ కోర్సు భిన్నమైంది. ఆయా రంగాల్లో అభ్యర్థులు ఎక్కువగా, ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. సీఏలో మాత్రం అభ్యర్థులు తక్కువగా ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిమాండ్ అధికంగా ఉన్న సీఏ కోర్సును పదో తరగతి దశ నుంచే లక్ష్యంగా పెట్టుకోవాలి.

 మూడు దశలు:
 సీఏ కోర్సును ఐసీఏఐ నిర్వహిస్తుంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ),ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి.

 సీపీటీ:
 పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ పరీక్ష ఏటా జూన్, డిసెంబర్‌లో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసి ఉన్నవారు లేదా ఇంటర్, డిగ్రీ.. ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీకి హాజరుకావాలంటే దరఖాస్తు చేసుకునే సమయానికి, సీపీటీకి మధ్య రెండు నెలల వ్యవధి తప్పనిసరి. అంటే జూన్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే ఏప్రిల్ ఒకటో తేదీలోపు; డిసెంబర్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే అక్టోబర్ ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి.

 పరీక్ష విధానం: సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్‌కు 60 మార్కులు, మర్కంటైల్ లాకు 40 మార్కులు, జనరల్ ఎకనామిక్స్‌కు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 50 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి విభాగంలో 30 శాతం మార్కులు, అన్ని విభాగాల్లో కలిపి 100 మార్కులు సాధించాలి.

 ఐపీసీసీ:
 సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్‌లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తంమీద 50 శాతం మార్కులు రావాలి.

 గ్రూప్-1: పేపర్-1: అకౌంటింగ్; పేపర్-2: బిజినెస్ లా, ఎథిక్స్, కమ్యూనికేషన్; పేపర్-3: కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; పేపర్-4: టాక్సేషన్.

 గ్రూప్-2: పేపర్-5: అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్; పేపర్-6: ఆడిటింగ్ అష్యూరెన్స్; పేపర్-7: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
 ప్రతి పేపర్‌కు గరిష్ట మార్కులు 100.


 డిగ్రీతో నేరుగా:
 గతంలో సీఏలో చేరాలంటే.. ప్రతి ఒక్కరూ సీపీటీ తప్పనిసరిగా రాయాల్సిందే. ఇది పూర్తయితేనే రెండో దశ ఐపీసీసీలో ప్రవేశించడానికి వీలయ్యేది. కానీ, ఇటీవల సడలించిన నిబంధనల ప్రకారం  55 శాతం మార్కులతో కామర్‌‌స గ్రాడ్యుయేట్స్/ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తిచేసిన వారు, 60 శాతం మార్కులతో ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్/ పీజీ పూర్తిచేసిన వారు, ఐసీడబ్ల్యూఏఐ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు సీపీటీకు హాజరు కావల్సిన అవసరం లేదు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు.

 ఆర్టికల్స్:
 ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్ కూడా సంపాదించుకోవచ్చు.

 ఫైనల్:
 ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఫైనల్ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి. పూర్తిస్థాయి చార్టర్డ్ అకౌంటెంట్‌గా తీర్చిదిద్దే ఫైనల్ కోర్సు కూడా రెండు గ్రూపులుగా ఉంటుంది. ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి. అవి..
 గ్రూప్-1: పేపర్-1: ఫైనాన్షియల్ రిపోర్టింగ్; పేపర్-2: స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; పేపర్-3: అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్; పేపర్-4: కార్పొరేట్ అండ్ అలైడ్ లాస్.
 గ్రూప్-2: పేపర్-5: అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్; పేపర్-6: ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్; పేపర్-7: డెరైక్ట్ టాక్స్ లాస్; పేపర్-8: ఇన్‌డెరైక్ట్ టాక్స్ లాస్.
 ఐపీసీసీ మాదిరిగానే ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించాలి. ఫైనల్‌తో పాటు జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు కూడా చేయాలి.

 ఉన్నత విద్య:
 కేవలం ఇంటర్ అర్హతతో పూర్తి చేయగలిగే సీఏ కోర్సుకి.. ప్రభుత్వం ఇతర బ్యాచిలర్ డిగ్రీలతో సమానంగా గుర్తింపు ఇచ్చింది. ఈ క్రమంలో సీఏ ఫైనల్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఎంకాం, ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 మొదలైన అన్ని ఉద్యోగ పరీక్షలకు హాజరుకావచ్చు.

 కావల్సిన నైపుణ్యాలు:
 సీఏ కోర్సులో చేరేవారికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఎంతో అవసరం. వాటిలో ముఖ్యమైనది సహనం. విస్తృతంగా ఉండే సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించి ఆకళింపు చేసుకోవాలంటే సహనం ఎంతో అవసరం. అదేవిధంగా పుస్తకాల ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అన్వయించే సామర్థ్యం, తార్కిక ఆలోచన నైపుణ్యం కూడా కీలకమే. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ నెట్‌వర్కింగ్ స్కిల్స్ అవసరం కూడా ఎంతో ఉంటుంది.


 కెరీర్ ఆప్షన్స్:
 సీఏ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్న వేళ సీఏ కోర్సు పూర్తిచేసినవారికి అవకాశాలు అపరిమితమవుతున్నాయి.

 అవకాశాలకు ఆకాశమే హద్దు:
 సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ సంస్థలు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాయి. అవి: సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఆడిటింగ్ ఫర్మ్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ హౌసెస్, పేటెంట్ ఫర్మ్స్, లీగల్ హౌసెస్.

 సంప్రదాయ, ఆధునిక విభాగాలు:
 సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ టాక్స్; టాక్స్ ప్లానింగ్ తదితర సంప్రదాయ విభాగాలతో పాటు టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి.

 టైర్-3 పట్టణాల్లోని రిటైల్ షాపులు, జ్యువెలరీ, వస్త్ర, తదితర వాణిజ్య, వ్యాపార సంస్థల ఆదాయవ్యయాలు, ఉత్పత్తి ఖర్చులు, స్టేషనరీ, మానవ వనరులకు చెల్లించే వేతనాలు, ఇతర వ్యయాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, కంపెనీ లాభనష్టాలు.. ఇలా ప్రతి దశలోనూ సీఏలతో సంస్థాగత ఆడిటింగ్ నిర్వహించడం అనివార్యం. ఈ నేపథ్యంలో నిపుణులైన సీఏల అవసరం భారీ స్థాయిలో ఉంటోంది. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు.

 వేతనాలు:
 సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం
 రూ. 35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు రూ. 10 లక్షల వరకు వార్షిక వేతనం అందుకోవచ్చు.

 విధులు:
 ఏ సంస్థలోనైనా ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వాటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల టాక్స్ ప్లానింగ్ విషయుంలో సీఏ అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జారుుంట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు, బీపీఓ మొదలైన వాటిలో సీఏలు కీలక పోషిస్తారు.

 కె రీర్ గ్రాఫ్:
 కెరీర్ ప్రారంభంలో అకౌంట్స్ లేదా ఫైనాన్స్ ఆఫీసర్‌గా అడుగుపెట్టిన వారు అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఫైనాన్స్ డెరైక్టర్, సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) స్థాయికి చేరుకోవచ్చు.

 అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సు:
 సీఏ గట్టెక్కలేని వారి కోసం ఐసీఏఐ ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తిచేసి, ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. పరిశ్రమలో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు, డిమాండ్ ఉంది. ఈ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థల్లో చేరి కనీసం రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ రెండో గ్రూప్‌లో కూడా ఉత్తీర్ణత సాధించి తర్వాత ఫైనల్‌ను పూర్తిచేసి పూర్తిస్థాయి సీఏ హోదాను పొందొచ్చు.

 సీపీటీ పరీక్షకు ముఖ్య తేదీలు:
 దరఖాస్తుల లభ్యత:
 అక్టోబర్ 7 నుంచి 28, 2013 (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్).
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
 అక్టోబర్ 28, 2013 (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్).
 రాత పరీక్ష తేదీ:
 సీపీటీ పరీక్షను డిసెంబర్ 15న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లుగా నిర్వహిస్తారు.
 వెబ్‌సైట్: www.icai.org


 2013లో ఐసీఏఐ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో కొత్తగా సీఏ కోర్సు పూర్తిచేసిన 902 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు.
 ప్రాంగణ నియామకాల్లో 58 కంపెనీలు పాల్గొన్నాయి.
 విదేశాల్లో ఉద్యోగం పొందిన అభ్యర్థుల అత్యధిక వేతనం ఏడాదికి రూ.21 లక్షలు.
 దేశీయంగా ఉద్యోగం లభించిన అభ్యర్థుల గరిష్ట వేతనం రూ.16.55 లక్షలు.




 ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ స్కోర్

 కెరీర్‌కు సంబంధించి స్పష్టమైన అవగాహనతో, లక్ష్యంతో సీఏ కోర్సులోకి అడుగుపెట్టాలి. సబ్జెక్టులు ఎంత కష్టంగా ఉన్నాసరే సరైన ప్రణాళికతో చదివితే మంచి స్కోరింగ్ సాధ్యమన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏదీ కష్టపడకుండా రాదన్న వాస్తవాన్ని గుర్తించి, ముందడుగు వేయాలి. టైం మేనేజ్‌మెంట్ పాటిస్తూ ఒత్తిడికి గురవకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఎక్కువ స్కోర్ సాధించడం కష్టమేమీ కాదు. శిక్షణ తరగతుల్లో ఏ రోజు చెప్పింది ఆ రోజే చదవడం, సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి. లేకుంటే సబ్జెక్టులపై అనాసక్తత ఏర్పడే ఆస్కారం ఉంటుంది.

 నేను ఇంటర్ ఎంపీసీ పూర్తిచేశాను. తర్వాత సీఏలోకి అడుగుపెట్టాను. అకౌంట్స్, ట్యాక్సేషన్, ఆడిటింగ్ తదితర అంశాలు పూర్తిగా కొత్తవి కావడం వల్ల నేర్చుకోవాలన్న ఉత్సుకత పెరిగింది. ఈ ఉత్సాహం చివరి వరకు ఉండటం వల్ల మెరుగైన స్కోర్ సాధించగలిగాను. సీఏ ఫైనల్లో భాగంగా ఉన్న ఆర్టికల్‌షిప్ చాలా ముఖ్యమైంది. అప్పటివరకు వివిధ అంశాలకు సంబంధించి పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అప్లై చేయడానికి ఆర్టికల్‌షిప్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్లకు అవకాశాలు బాగున్నాయి. ఐటీ, ఫార్మా, ఆతిథ్యం, ఇన్‌ఫ్రా రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సీఏ పూర్తిచేసిన వారికి డిమాండ్ బాగా పెరుగుతోంది.